Hansika Motwani Marriage : దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది హన్సిక. చైల్డ్ ఆర్టిస్ట్‌గా హన్సిక హిందీ జనాలకు పరిచయమే. యాడ్స్‌లోనూ హన్సిక నటించింది. సీరియల్స్‌లోనూ హన్సిక చైల్డ్ కారెక్టర్లు చేసింది. ఇక దేశ ముదురు అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కాశ్మీర్ యాపిల్ బ్యూటీ అంటూ హన్సికను తెలుగు ప్రేక్షకులు పిలుచుకుంటూ ఉంటారు. అయితే తెలుగులోనే కాకుండా హన్సికకు సౌత్ మొత్తం ఫాలోయింగ్ ఉంది. హిందీలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హన్సిక మాత్రం ఎక్కువ కాలం తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగలేకుండా పోయింది. కానీ కోలీవుడ్‌లో మాత్రం మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అలా తమిళ బ్యూటీగానే ఫిక్స్ అయింది.అక్కడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేసింది. అవే డబ్బింగ్ రూపంలో తెలుగు వారి ముందుకు వచ్చాయి. అయితే హన్సికకు మాత్రం తెలుగులో ఆఫర్ వచ్చి చాలా కాలమే అయింది. మంచు విష్ణుతో చేసిన దేనికైనా రెడీ చిత్రం బాగానే హిట్ అయింది.


ఆ తరువాత తెనాలి రామకృష్ణ పర్వాలేదనిపించింది. అయితే ఆమె చేతిలో ఎక్కువగా తమిళ ప్రాజెక్టులే ఉన్నాయి. మై నేమ్ ఈజ్ శృతి అంటూ హన్సిక సందడి చేసేందుకు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు హన్సిక పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసింది. తన పెళ్లి ఏర్పాట్లు సీక్రెట్‌గా జరుగుతున్నాయనే సమాచారం బయటకు వచ్చింది.


నిహారిక పెళ్లి, రాజమౌళి తనయుడి పెళ్లిళ్లు రాజస్థాన్‌లోని కోటల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హన్సిక కూడా తన డెస్టినేషన్ వెడ్డింగ్‌ను రాజస్థాన్‌లోని కోటల్లోనే చేసుకుంటుందట. ఈ మేరకు డిసెంబర్‌ నెలలో హన్సిక పెళ్లి జరగబోతోందట. దీని కోసం కోటను మొత్తం బుక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది. కానీ డిసెంబర్‌లో పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల మీద హన్సిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Also Read : Shilpa Shetty - Anushka Shetty : 'కాంతారా'కు శెట్టిల సపోర్ట్.. శిల్పా శెట్టి, అనుష్క శెట్టిల పోస్ట్ వైరల్


Also Read : Nikesha Patel-Pawan Kalyan : విశాఖలో పవన్ కళ్యాణ్‌.. నీ వెంట నడుస్తా.. కొమురం పులి హీరోయిన్ ట్వీట్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook