One not Five Minutes Trailer Update సినిమా చరిత్రలోనే తొలి ప్రయత్నంగా వన్ నాట్ ఫైవ్ మినిట్స్ అనే ప్రాజెక్ట్ రాబోతోంది. సింగిల్ షాట్‌లో సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక నటించిన చిత్రం వన్ నాట్ ఫైవ్ మినిట్స్. రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటు సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్‌లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్‌లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. 


ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది.


సింగిల్ క్యారక్టర్‌తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ  చిత్రంలోని పాత్రకు హన్సిక చక్కగా నప్పారు. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించింది. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణంగా నిలుస్తుంది. బ్రహ్మ కడలి గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా కుదిరింది. కెమెరామన్ కిషోర్ బోయిదాపు లైటింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా కొత్తగా ప్రయత్నించారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి.. సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.


Also Read:  Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!


Also Read: Rajinikanth Called : వీర సింహారెడ్డి డైరెక్టర్ కు రజనీకాంత్ ఫోన్.. గాల్లో తేలిపోతున్నాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook