Hanuman Movie: `హనుమాన్` నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్.. విలన్‌గా స్టార్ హీరో! ఫస్ట్‌లుక్ పోస్టర్ అదుర్స్
Vinay Rai introduced as Michael in Hanu Man Movie: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న `హనుమాన్` సినిమాలో వినయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
Hanu-Man Movie Poster: Vinay Rai First Look Poster goes viral in Hanu Man Movie: 2007లో వచ్చిన 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో వినయ్ రాయ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన వినయ్.. వరుస సినిమాలు చేశాడు. జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై వంటి హిట్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్‌గా నటిస్తున్నాడు. తుప్పరివలన్ (డిటెక్టివ్) సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గా అదరగొట్టాడు. చంద్రకళ, డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు) సినిమాల్లో నెగెటివ్ పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు.
వినయ్ రాయ్ మరోసారి విలన్‌గా అదరగొట్టేందుకు సిద్దమయ్యాడు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న 'హనుమాన్' సినిమాలో వినయ్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో వినయ్ ముఖానికి గ్యాస్ మాస్క్ పెట్టుకుని, ఒక కన్నును ఐ పాచ్‌తో మూసేసి టెంపుల్ ముందర ఆర్మీ సైన్యంతో ముందుకు దూసుకొస్తున్నాడు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న హనుమాన్ చిత్రంలో మైఖేల్ పాత్రలో వినయ్ రాయ్ నటించనున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు కూడా ఆసక్తి కలిగించాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ నటిసున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు వరసలో ఉంటాడు. ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి వినూత్న చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ‘హనుమాన్’ అనే సూపర్ హీరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.
Also Read: Deisel Missing Case: ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం..దొంగలు ఎవరో తెలుసా..?
Also Read: Repo Rate Hike: రెపో రేటు పెంపు... ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై పెరగనున్న వడ్డీ రేట్లు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి