Hanu Raghavapudi Mythri Movie Makers: సీతారామం డైరెక్టర్ కొత్త సినిమా ఫిక్స్.. భారీ బడ్జెట్ తోనే?
Hanu Raghavapudi Next Movie: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి తరువాతి సినిమా ఫిక్స్ అయింది. ఆ వివరాలు
Hanu Raghavapudi Movie with Mythri Movie Makers: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హను రాఘవపూడి. అయితే ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుంది అనే విషయం మీద చాలా ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు హను రాఘవపూడి తదుపరి చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉండబోతుందని తెలుస్తోంది. అది కూడా ఒక భారీ బడ్జెట్ సినిమా అని అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి మరే వివరాలు బయటకు రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ సినిమా నానితో తెరకెక్కుతుందనే ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ నిజంగానే ఆయన నానితో సినిమా చేస్తున్నాడా? లేదా? అనే విషయం క్లారిటీ లేదు. ఇక కొత్త గూడెంకి చెందిన ఆయన ఈ మధ్య అతను కాలేజ్ ఫంక్షన్ కోసం అక్కడికి వెళ్ళగా అక్కడ మీడియాతో మాట్లాడిన ఒక విషయం హాట్ టాపిక్ అయింది.
అదేమిటంటే తన తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసే వారని, తల్లి కోర్టులో పనిచేసేవారని చెప్పుకొచ్చారు. చిన్నతనంలో చూసిన శంకరాభరణం తర్వాత ఒక కథకుడిగా దర్శకుడిగా మారాలని ఆలోచనకి బీజం పడిందని ఒక వైపు క్లాసులో టీచర్లు పాఠాలు చెప్తుంటే మరోవైపు తన మనసులో కథలు అందులో పాత్రలు మెదిలేవి అని చెప్పుకొచ్చారు.
ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక పత్రికలో కథల పోటీ వచ్చిందని తెలిసి హంతకుడు పేరుతో ఒక క్రైమ్ స్టోరీ రాయడం మొదలు పెట్టానని ఒకపక్క లెక్కల మాస్టారు ఆల్జీబ్రా చెబుతుంటే నేను అది రాయకుండా కథ రాస్తుంటే ఆయనకు దొరికిపోయి ఆయన చేతిలో దెబ్బలు కూడా తిన్నానని పేర్కొన్నారు. ఇక ఇంటర్లో కాలేజీకి వెళ్ళినట్టే వెళ్లి మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లే వాళ్ళమని ఒక సారి గులాబీ సినిమా చూసి వస్తుంటే తమ లెక్చరర్ పట్టేసుకున్నారు అని చెప్పుకొచ్చారు.
Also Read: Telugu OTT Releases This Week: బుట్టబొమ్మ సహా ఈవారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి