Hanu Raghavapudi Review on Dasara నాని దసరా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఓవర్సీస్‌లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా యాభై మూడు కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్టు సమాచారం అందుతోంది. అలా దసరా సినిమా ఇప్పుడు టాలీవుడ్‌ను ఆకట్టుకుంటోంది. మొదటి సినిమాతోనే ఇంత బాగా తీసిన శ్రీకాంత్ ఓదెల గురించి ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. నాని దసరా సినిమా మీద హను రాఘవపూడి తన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా లాంటి సినిమా లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే వస్తుంది.. ఈ కారణాల వల్లే దసరా సినిమా ప్రత్యేకంగా నిల్చింది.. సూరిగాడు పాత్రకు దీక్షిత్‌ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. వెన్నెలగా కీర్తి సురేష్‌ జీవించింది.. ఇంతకంటే ఎక్కువగా చెప్పలేం.. దసరా అనేది ఓ శిఖరం అయితే.. సంతోష్ నారాయణ్ అనేవాడు ఆ శిఖరానికి పునాది వంటి వాడు.. ఆయన కంటే ఇంత గొప్పగా ఎవ్వరూ చూపింంచలేరు.


కొత్త దర్శకుడిని నమ్మింత ఇంత గొప్పగా నిర్మించిన నిర్మాత గ్రేట్.. సుధాకర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ధరణి పాత్రను పోషించే వాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం నాని మాత్రమే. నాని దశ నడుస్తోంది ఇప్పుడు.. ఇక ఈ సినిమాలో ఓ షాట్ ఉంటుంది.. ధరణి మీద రౌడీలంతా పడిపోతారు.. వారందరినీ గాల్లోకి ఎగిరేస్తూ.. నోట్లో కత్తి పెట్టుకుని, రక్తాన్ని తిలకంగా పెట్టుకునే షాట్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఇలాంటి ఓ సినిమాను తీసిన శ్రీకాంత్ ఓదెలకు ఆయన టీంకు ఫిదా అయ్యాడు. తెలుగు, ఇండియన్ సినిమాలో ఇలాంటి సినిమాలను తీసేందుకు మార్గాన్ని చూపించావ్ అన్నాడు.


 



నాని దసరా సినిమా ఇప్పుడు రెండ్రోజుల్లోనే 53 కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కీర్తి సురేష్‌, నానిల అద్భుతమైన పర్ఫామెన్స్‌లతో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇక శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్టర్‌గా అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీకాంత్ నెక్స్ట్ సినిమా మీద అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే.


Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే


Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook