HanuMan First Weekend Collections: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా టీజర్ విడుదల దగ్గర నుంచి అంచనాలను పెంచుకుంటూ వచ్చింది. ఇక విడుదల అయ్యాక కూడా ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ దూసుకుపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతికి ఈ సినిమాతో పాటు ముగ్గురు స్టార్ హీరోల చిత్రాల కూడా విడుదలయ్యాయి. అందులో జనవరి 12న హనుమాన్ సినిమాతో మహేష్ బాబు గుంటూరు కారం విడుదల అవ్వగా.. జనవరి 13న వెంకటేష్ సైంధవ్ అలానే జనవరి 14న నాగార్జున నా సామి రంగా సినిమాలు విడుదలయ్యాయి. కానీ మూడు సినిమాలు కూడా మిశ్రమ స్పందన తెచ్చుకోవడంతో ప్రస్తుతం సూపర్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది హనుమాన్.


ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్సీస్ లో క్రియేట్ చేస్తోన్న రికార్డ్ అంతా ఇంతా కాదు.  బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఓవర్సీస్ లో దగ్గరదగ్గరగా 20 మిలియన్ల డాలర్లు కొల్లగొట్టాయి. సలార్ తెలుగు వర్షన్ 5 మిలియన్ డాలర్ల వరకు వసూల్ చేసింది. దీంతో సలార్ అక్కడ నాన్ రాజమౌళి రికార్డును క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు ఇవ్వ హీరో తేజ సినిమా హనుమాన్ ఆ రికాార్డులకే ఏకంగా ఎసరు పెట్టేలా ఉంది.  హనుమాన్ కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఓవర్సీస్ లో మూడు మిలియన్ల డాలర్లను కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.


రామ్ చరణ్ రంగస్థలం, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఓవర్సీస్ లో మూడున్నర మిలియన్ల వరకు వెళ్లాయి. ఆ తరువాత ఏ చిత్రాలు కూడా ఆ రేంజ్ కి పోలేదు. రాజమౌళి, ప్రభాస్ సినిమాలే ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశాయి. అసలు రెండు మిలియన్లు, మూడు, మూడున్నర మిలియన్లు అనేది లాంగ్ రన్‌లో కొట్టడమే రేర్ ఫీట్. కానీ ఈ హనుమాన్ మూడు నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తోంది.


 



హనుమాన్ సినిమా ఆర్ఆర్ఆర్, బాహుబలి, బాహుబలి 2 రికార్డులను బీట్ చేయలేకపోవచ్చు కానీ  ఇతర తెలుగు సినిమాల విషయంలో మాత్రం ఈ చిత్రం కచ్చితంగా  కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా ఉంది. రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయడం పక్కన పెడితే.. ఇకపై నాన్ హనుమాన్ రికార్డులు అనేలా ఈ సినిమా అక్కడ దూసుకుపోతోంది. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాలి.


Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!


Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter