Prashanth Varma in Bollywood : ఆ!, కల్కి, అద్భుతం వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ.. ఈ మధ్యనే విడుదలైన హను మ్యాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. తేజ సజ్జ హీరోగా విడుదలైన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని.. సంక్రాంతి విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా సూపర్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ రేంజ్ బాగా పెరిగిపోయింది. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక అటు బాలీవుడ్ లో కూడా ప్రశాంత్ వర్మ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు.  తాజాగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఈ వార్త ఇప్పుడు నిజమైందని తెలుస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం దీనికి ఒక ఆసక్తికరమైన టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. తన సినిమాలకి టైటిల్స్ ఎప్పుడు కొంచెం  కొత్తగానే పెట్టుకునే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి బ్రహ్మ రాక్షస అని టైటిల్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే ప్రేక్షకులు మరోసారి ఈ డైరెక్టర్ తప్పకుండా మరో వింత కథతో రాబోతున్నారని అంచనాల వేస్తున్నారు.



హనుమాన్ సినిమా నుంచి సూపర్ హీరోల కథల మీద దృష్టి పెట్టిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం కూడా అలాంటి జోనర్ నే ప్లాన్ చేసినట్లు సమాచారం.


ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ ను కలిసి కథ కూడా వినిపించారట. ప్రశాంత్ వర్మ నేరేషన్, సినిమా కథ బాగా నచ్చడంతో రణవీర్ సింగ్ వెంటనే ఓకే చెప్పేశారట. షూటింగ్ హిందీలో జరిగినప్పటికీ.. ఈ సినిమా మిగతా భాషల్లో కూడా విడుదల కాబోతోంది.
ప్రస్తుతం హనుమన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ మీదే ప్రశాంత్ వర్మ దృష్టి మొత్తం ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బ్రహ్మ రాక్షస గురించి అప్డేట్లు వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పుడూ బాలీవుడ్ లో కూడా వరుస విజయాలను అందుకుంటాడో లేదో చూడాలి. బ్రహ్మ రాక్షస హిట్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మకి మరిన్ని బాలీవుడ్ హీరోస్తో పనిచేసే అవకాశం వస్తుందని చెప్పుకోవచ్చు.


Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్‌


Also Read: Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter