KCR Emotional: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకున్న బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టిన ఈ యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. వెళ్లిన ప్రతి చోట ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తుండడంతో గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా గురువారం సూర్యాపేట నుంచి మొదలుపెట్టిన బస్సు యాత్ర సాయంత్రానికి భువనగిరి చేరుకుంది. క్యామ మల్లేశ్‌కు మద్దతుగా ప్రచారం చేసిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Amit Shah: రేవంత్ రెడ్డిపై అమిత్ షా ఫైర్.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు
'పోరాడి తీసుకువచ్చిన రాష్ట్రం యువకులదే' అని కేసీఆర్ స్పష్టం చేశారు. తన వయసు అయిపోతుందని తెలంగాణ రాష్ట్రం మీదే అంటూ యువకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'మాకు వయస్సు మిరిపోతుంది. ఈ తెలంగాణ మీది. భవిష్యత్తు మీది. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు.. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు ఎవరి అవసరం ఉంటుందో ఆలోచించి ఓటు వేయండి' అని యువకులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్ చేస్తా: కేసీఆర్
'ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు' అని ప్రకటించారు. 'ఒక పార్టీ దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతోంది.. మరో పార్టీ దేవుడి మీద ఒట్లు వేస్తోంది' అని కాంగ్రెస్, బీజేపీలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు కీలక విజ్ఞప్తి చేశారు. 'ముస్లిం సోదరుల్లారా మీరు చూస్తున్నారు బీజేపీ నా బిడ్డను జైల్లో పెట్టింది.. అయినా నేను భయపడను. మేము సెక్యులర్.. అందరితో కలిసి ఉంటాం. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీకే. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే' అని కేసీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీలో జరిగిన పరిణామాన్ని గుర్తు చేశారు.
'ఒకడేమో బీఆర్ఎస్, బీజేపీకి బీ-టీమ్ అంటాడు.. ఇంకొకడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కి బీ-టీమ్ అంటాడు. కానీ భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్‌ను దించి భువనగిరి చైర్మన్‌గా కాంగ్రెస్ వాడు, వైస్ చైర్మన్‌గా బీజేపీ వాడు కూర్చున్నారు' కేసీఆర్ ప్రస్తావించారు. ఈ రెండూ ఒకటేనని ప్రజలు గుర్తించి బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
'బేటీ పడావో.. బేటీ బచావో అన్నారు. ఏ బేటికి అయినా పడాయించారా.. ఏ బేటిని అయినా బచాయించారా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల పట్ల దౌర్జన్యాలు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది' అని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ, బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన క్యామ మల్లేశ్‌ను ఓటేసి భువనగిరి ఎంపీగా గెలిపించాలని కేసీఆర్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter