Tollywood medium range most profitable movies: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు లేకుండా లో ఫ్రొఫైల్‌లో విడుదలైన సినిమా హనుమాన్. ముందు అందరు లైట్ తీసుకున్న ఈ మూవీ సంక్రాంతి సినిమాల్లో మిగతా సినిమాలను మడతేట్టేసింది. అంతేకాదు తెలుగులో సంక్రాంతి సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 92 యేళ్ల టాలీవుడ్ చరిత్రలో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటి టికెట్ రేట్స్‌తో పోలిస్తే.. ఇది తక్కువే అయినా.. కమర్షియల్‌గా సాలిడ్ హిట్‌గా నిలిచింది.
ఇక సంక్రాంతి సీజన్‌లో ఇప్పటి వరకు అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల 'అల  వైకుంఠపురములో' అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి చిత్రంగా నిలిచింది. తాజాగా హనుమాన్ మూవీ 'అల వైకుంఠపురములో' లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హనుమాన్ మూవీ థియేట్రకల్‌గా చాలా తక్కువ రేటుకే అమ్ముడు పోవడం ఈ మూవీకి కలిసొచ్చిన అంశం. కానీ వసూళ్లు మాత్రం అమ్మిన రేటు కంటే 5 రెట్లు లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు ఈ మూవీ థియేట్రికల్‌గానే రూ. 120 కోట్లకు పైగా లాభాను తీసుకొచ్చింది. తాజాగా టాలీవుడ్‌లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.హనుమాన్ : రూ. 123 కోట్ల లాభాలు (రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
2. గీతా గోవిందం : రూ. 55.43 కోట్లా లాభాలు (రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
3. కార్తికేయ 2: రూ. 45.60 కోట్ల లాభాలు (రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
4.బేబి : రూ. 37.25 కోట్ల లాభాలు (రూ. 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
5.ఉప్పెన : రూ. 31.02 కోట్ల లాభాలు (రూ. 20.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
6.ఫిదా : రూ. 30.5 కోట్ల లాభాలు (రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
7.సీతారామం: రూ.30.30 కోట్ల లాభాలు (రూ. 16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
8.విరూపాక్ష: రూ. 26 కోట్ల లాభాలు (రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
9.జాతి రత్నాలు: రూ. 27.52 కోట్ల లాభాలు (రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
10.ఇస్మార్ట్ శంకర్: రూ. 22.78 కోట్ల లాభాలు (రూ. 17.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
11.బింబిసార : రూ. 22.32 కోట్ల లాభాలు (రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
12.అర్జున్ రెడ్డి: రూ. 20.3 కోట్ల లాభాలు ( రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)



మొత్తంగా హనుమాన్ మూవీ విడుదలైన 24 రోజుల్లో  దాదాపు రూ. 123 కోట్ల లాభాలతో  మీడియం రేంజ్ మూవీస్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. మొత్తంగా ఈ రికార్డును ఇప్పట్లో ఏ సినిమా బ్రేక్ చేయడం అంత ఈజీ కాదనే చెప్పాలి.


ఇదీ చదవండి:  Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.69,000 జీతంతో ఉద్యోగం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook