Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. గ్రాడ్యూయేఫన్ పూర్తి చేసినవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఎవరు అర్హులో వివరాలను తెలుసుకుందాం.
మీరు డిగ్రీ పట్టా పొందారా? అయితే మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం పొందవచ్చు. వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్ట్ కోసం విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు చివరి తేదీ, వేతనాల వివరణాత్మక వివరాలు ఇవ్వబడ్డాయి. ఈ జాబ్ కి అప్లై చేసేవారికి మరో గుడ్ న్యూస్ ఏంటంటే? ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక పూర్తి చేస్తారు.
ఇదీ చదవండి: Paytm Payments Bank: ఒక పాన్‌కార్డ్‌పై 1000 ఖాతాలు... ఈ కారణాల వల్ల Paytm పై RBI ప్రత్యక్ష చర్య..
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం 38 సెక్యూరిటీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే కనీసం 3 నెలల కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
బీఓబీ జాబ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎయిర్/నేవీ/ఆర్మీలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా అభ్యర్థికి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుకు సమానమైన అనుభవం ఉండాలి. మొత్తం 38 ఖాళీలలో SC- 5, ST-2, OBC- 10, EWS- 3, UR-18 భర్తీ చేయనుంది.
అభ్యర్థలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన ఎంపికైన అభ్యర్థులకు రూ.69 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు చేయడానికి 8 ఫిబ్రవరి 2024 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. ఎంపికైన అభ్యర్థి 1 సంవత్సరం ప్రొబేషన్ వ్యవధిని పూర్తి చేయాలి.
ఇదీ చదవండి: Bharata Ratna: భారతరత్న ప్రదానం చేయడానికి ప్రమాణాలు ఏమిటి? అవార్డు గ్రహీతలు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook