HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
Pawan Kalyan Personal Life: టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇప్పుడు రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల.. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
Pawan Kalyan Marriages: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా.. చలామణి అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ తరఫున.. పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది, నేడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాత్రం.. ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి గల కారణం ఏంటో.. ఇప్పుడు ఈ కథనం ద్వారా చూద్దాం.
నందిని రెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాకముందే పెద్దల నిర్ణయం మేరకు.. నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన మొదట్లో ఈ జంట బాగానే ఉన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి. ఆ గొడవలు కాస్త పెద్దవి కావడంతో.. ఇద్దరు విడిపోయారు . అయితే చిరు ఫ్యామిలీ వీరిద్దరి కలయిక కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇద్దరు మాత్రం విడాకులు తీసుకున్నారు.
రేణు దేశాయ్
ఇక అనంతరం ప్రముఖ హీరోయిన్, మోడల్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డారు పవన్ కళ్యాణ్. కొన్నాళ్లు ఆమెతో సహజీవనం చేసి, కొడుకు అకీరా నందన్.. జన్మించిన తర్వాత కొడుకు సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ను..ఇష్టపడే పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత.. ఆయన గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అప్పట్లో పవన్ క్యారెక్టర్ నచ్చక రేణు దేశాయ్ వదిలేసింది అనే రూమర్స్ వచ్చాయి. కానీ ఆ క్యారెక్టర్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ కు సహాయం చేసే గుణం ఎక్కువ. పైగా ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. ఆరెంజ్ సినిమా సమయంలో తన అన్న నాగబాబు ఆస్తులమ్ముకొని రోడ్డున పడిన సమయంలో కూడా ఆర్థిక సహాయం చేశారు. ఈ విషయం నచ్చక ఈమె పవన్ కళ్యాణ్ తో విడిపోయింది అని అప్పట్లో కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. అప్పటికే కూతురు ఆధ్యా కూడా జన్మించారు. కానీ ఈ వార్తల్లో నిజమెంతో ఎవరికీ తెలియదు.
అన్నా లెజినోవా..
అలా ఇద్దరు భార్యలను దూరం చేసుకున్న పవన్ కళ్యాణ్ తనలాగే ఆలోచించే అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నారు. మొదట ఈమె ఇంగ్లీష్ సినిమాలలో నటించేది. రష్యాకు చెందిన ఈమె పవన్ కళ్యాణ్ లాగే వేలకోట్ల ఆస్తులను దానంగా ఇచ్చి పోగొట్టుకుంది . తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇక ఒకరి గురించి ఒకరు తెలుసుకొని వివాహం చేసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అన్నా లెజినోవా అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.
అలా పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు.
Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్ అలర్ట్.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన
Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.