Richi Gadi Pelli Trailer కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఇప్పుడు ఆదరణ ఉంటోంది. ఓటీటీలు, థియేటర్లు అనే తేడా లేకుండా కొత్త కథలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే రిచి గాడి పెళ్లి అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనేది అర్థం అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లికి ముందు తన ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని అనుకుంటాడు హీరో. దాని కోసం అంతా కలిసి ఓ ప్రైవేట్ రిసార్ట్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే అక్కడకు చేరిన గ్యాంగ్ అంతా కలిసి ఓ ఆట ఆడుతారు. ఎవరికి ఏ ఫోన్ వచ్చినా కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడాలనే చాలెంజ్‌ను తీసుకుంటారు.


దీంతో కథ రకరకాలుగా మార్పులకు లోనవుతున్నట్టుగా ట్రైలర్ చూపిస్తోంది. దీంతో ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుందా? రొమాంటిక్ యాంగిల్ తీసుకుంటుందా? అన్నది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన హరీష్‌ శంకర్.. చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమాలా ఉందని హరీష్‌ శంకర్ అన్నాడు. ఆ చిన్న ఆట వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశమని తెలుస్తోందని హరీష్‌ శంకర్ చెప్పుకొచ్చాడు.


 



దర్శక నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ.. రిచి గాడి పెళ్లి అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ అని అన్నాడు, ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశామని చెప్పుకొచ్చాడు. కె.ఎస్.ఫిల్మ్ వర్క్స్  బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ వంటి వారు నటించారు.


Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్


Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook