Captain Miller teaser out: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) లేటెస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’(Captain Miller). ఈ పీరియాడికల్ ఫిల్మ్‌కి 'రాకీ అండ్ సాని కాయిదం' ఫేమ్  అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలకపాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. బ్రిటిష్ కాలం నాటి యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్‌కి అన్నయ్యగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మార్క్ బెన్నింగ్టన్, నాజర్, ప్రియాంక అరుల్మోహన్, నివేదిత సతీష్, జాన్ కొక్కెన్ మరియు మూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ధనుష్ మూడు గెటప్ ల్లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ధనుష్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ మిల్లర్ టీజర్ (Captain Miller teaser ) రిలీజ్ చేశారు. ప్రచార చిత్రం మెుత్తం పోరాట ఘట్టాలు.. యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు. బ్రిటిషుర్స్ కు, కెప్టెన్ మిల్లర్ కు జరిగే పోరుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 100 సెకన్స్ నిడివి ఉన్న టీజర్.. సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 85 శాతం పూర్తయింది. ఈ చిత్రం ధనుష్ కెరీర్‏లోనే అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతుంది. ఈసినిమాను డిసెంబరు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీని సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. 



Also Read: Samajavaragamana OTT: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన 'సామజవరగమన'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook