Ban Adipurush: ఆదిపురుష్ బ్యాన్ చేయండి.. టీజర్ రిలీజ్ చేసిన అయోధ్య ప్రధాన పూజారి షాకింగ్ డిమాండ్!
Head priest of Ayodhya Ram temple calls for Ban on Adipurush: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి ఇప్పటికే వార్నింగ్ ఇవ్వగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఏకంగా సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
Head priest of Ayodhya Ram temple calls for Ban on Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. తానాజీ ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ఆంజనేయుడి పాత్రలో దేవదత్తా కనిపించనున్నారు. అలాగే రవాణా బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను అయోధ్య వేదికగా ఘనంగా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే ఈ టీజర్లో ప్రభాస్ సహా మిగతా పాత్రధారులు అందరూ కార్టూన్ క్యారెక్టర్లుగా అనిపిస్తూ ఉండడంతో టీజర్ మీద అనేక మంది పెదవి విరుస్తున్నారు. ఇక టీజర్ లో హనుమంతుడికి తోలు గుడ్డలు కట్టడం కరెక్ట్ కాదని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరో నటి. బీజేపీ నేత అయితే రావణుడికి చూపే పద్ధతి ఇదేనా? అంటూ ఏకి పారేశారు.
ఇంత జరుగుతూ ఉండగా ఇప్పుడు మరో వివాదంలో ఆదిపురుష్ టీజర్ చిక్కుకుంది. ఏకంగా అయోధ్య రామాలయం ప్రధాన పూజారి ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడి గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఆదిపురుష్ టీజర్‌పై వివాదం కొనసాగుతున్న తరుణంలో, అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి బుధవారం ఈ సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడి వర్ణన మన ఇతిహాసానికి ఏమాత్రం పొంతన లేదని, ఈ టీజర్ అంతా వారి గౌరవానికి విరుద్ధంగా ఉందని అన్నారు.
ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. సినిమాలు తీయడం నేరం కాదని, అయితే ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించి హెడ్ లైన్స్ లోకి రావాలని అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఇక ఈ సినిమా టీజర్ గురించి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఆదిపురుష్ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను విడుదలకు ముందే సరిదిద్దాలని అన్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య తాను ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఇంకా చూడలేదని, అయితే మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సినిమాలు తీయకూడదని, తీసినా చూడకూడదని అన్నారు. ఇక ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.
Also Read: Adipurush Prabhas: 'రామ్‌లీలా'లో రావణ దహనం చేసిన ప్రభాస్, ఫిక్స్ వైరల్
Also Read: God Father Movie Day 1 Collections: హిట్టు సినిమా గాడ్ ఫాదర్ వసూళ్లు మొదటి రోజు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook