Hemachandra - Sravana Bhargavi Divorce : టాలీవుడ్ అనే కాదు దాదాపు అన్ని భాషల సినీ పరిశ్రమలో ఇప్పుడు విడాకులు వార్తలు హైలెట్ అవుతున్నాయి. ఎప్పుడు ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారు అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో పలు జంటలు విడాకులు తీసుకుని ఎవరికి వారు జీవిస్తూ ఉండగా ఇప్పుడు మరో టాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ జంట మరెవరో కాదు టాలీవుడ్ గాయనీ, గాయకులు శ్రావణ భార్గవి - హేమచంద్ర. తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన హేమచంద్ర అనేక సూపర్ హిట్ సాంగ్స్ అందించడమే కాక అనేకమందికి తన గాత్ర దానం చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణ భార్గవి కూడా తెలుగులో అనేక సినిమాల్లో సింగర్ గా తన ప్రతిభను చాటింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి 2013వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా శిఖర చంద్రిక అనే ఒక కుమార్తె కూడా 2016వ సంవత్సరంలో జన్మించింది. అయితే నిప్పు లేకుండా పొగ రాదు అన్న చందాన, అసలు ఎక్కడ మొదలైందో ? ఎందుకు మొదలైందో? తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా పలు వెబ్ సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో పెద్ద ఎత్తున కథనాలు బయటకు వస్తున్నాయి. 
సాధారణంగా అదేమీ లేకపోతే కనుక వారి నుంచి కచ్చితంగా ఖండన వస్తుంది. 


కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇతర పోస్టులను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తున్న హేమచంద్ర ఈ విషయం మీద స్పందించకపోవడంతో ఈ ప్రచారం నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరైతే హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్లి వాళ్ళ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు. ఇలా వార్తలు వస్తున్నాయి, నిజమా లేదా? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. 


సాధారణంగా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది వారి వ్యక్తిగత విషయాలు అయినా సినీ సెలబ్రిటీలు కావడంతో వారి పర్సనల్ జీవితాల మీద కూడా ఇటు ప్రేక్షకులకు, అటు ప్రజలకు కూడా ఆసక్తి ఏర్పడుతుంది.. ఇటీవల నాగచైతన్య విషయంలో కూడా ఇలాంటి ప్రచారం మొదలైంది. ఆయన మేజర్ హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఈ విషయం మీద సెలబ్రిటీలు స్వయంగా స్పందిస్తే కానీ అవి ఎంతవరకు నిజమో అనే విషయాన్ని ఖరారు చేయలేని పరిస్థితి.


Also Read: Revanth Reddy Meets Bandla Ganesh : అప్పుడు డిస్మిస్ చేయాలన్నాడు.. ఇప్పుడేమో?


Also Read: Vaani Kapoor Pics: బ్లాక్ డ్రెస్‌లో వాణీ క‌పూర్.. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.