K Viswanath Body buried but not cremated: సినీ పరిశ్రమలో సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత సహాయ దర్శకుడిగా మారి దర్శకుడుగా స్థిరపడిన కే విశ్వనాథ్ ఇటీవల వయోభారం రీత్యా ఏర్పడిన అనారోగ్యం వల్ల కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా చివరికి అనారోగ్యం విషమించి కన్నుమూశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కాగా వారంతా కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. దీంతో మరణించిన రోజు ఉదయమే ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయనను చివరి సారి చూసేందుకు సినీ పరిశ్రమలోని పెద్ద పెద్ద హీరోలు దర్శకులు అందరూ కదిలి వచ్చారు. అనేక మంది రాజకీయ ప్రముఖులు సైతం ఆయనను చివరి చూపు చూసుకున్నారు, అయితే ఆయన అంత్యక్రియలు జరిగిన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కే విశ్వనాథ్ బ్రాహ్మణులు అనే సంగతి దాదాపుగా అందరికీ తెలిసిందే.


అయితే బ్రాహ్మణులందరూ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారు కాబట్టి ఆయనను  దహనం చేస్తారు అంటే ఆయన పార్థివదేహాన్ని కాలుస్తారు అని అనుకున్నారు. అయితే ఆసక్తికరంగా ఆయన మృతదేహాన్ని కూర్చున్నట్టుగా ఖననం చేశారు, అంటే పూడ్చిపెట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయాలి కానీ ఖననం ఎందుకు చేశారు? అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం మీద రీసెర్చ్ చేయగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అది ఏమిటంటే బ్రాహ్మణులలో శైవులు, వైష్ణవులు అనే రెండు వర్గాల వారు ఉంటారట.


కే విశ్వనాథ్ శైవ వర్గానికి చెందిన వ్యక్తికాగా వారిలో లింగదారులు అని మరో ఉప వర్గం ఉంటుందట. వారిని చనిపోయిన తర్వాత లింగాకారంలో కూర్చోబెట్టి ఖననం చేస్తారట, అంటే పూడ్చి పెడతారట. కే. విశ్వనాథ్ ఉపవర్గం ప్రకారమే ఆయన దహన సంస్కారాలు జరిగాయి కాబట్టి ఆయనను ఖననం చేశారని చెబుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల అంత్యక్రియలు అన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయి కానీ కె విశ్వనాథ్ అంత్యక్రియలు మాత్రం పంజాగుట్ట స్మశాన వాటికలో జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఖననం చేసే అవకాశం లేకపోవడంతో ఖననం చేసే అవకాశం ఉన్న పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలు నిర్వహించారు. 
Also Read: RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!


Also Read: Sweets to K Vishwanath: కే విశ్వనాథ్ చివరి రోజుల్లో స్వయంగా అవి చేసి పంపిన కృష్ణంరాజు భార్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.