Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 రోజులు గడిచే కొద్ది చాలా ఆసక్తిగా మారుతూ వస్తోంది. తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం టాస్క్ లతోనే గడిచిపోయింది. బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేసిన రెండు లక్షల కోసం ఇంటి సభ్యులు మూడు క్లాన్స్ గా విడిపోయి గేమ్స్ ఆడారు. దీంట్లో భాగంగా విష్ణు ప్రియ, సోనియాల మధ్య గేమ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటివారం వీళ్లిద్దరి మధ్య పరిస్థితులు బాగానే ఉన్నా కూడా.. రెండవ వారం నుంచి ఒకరి మీద ఒకరు తెగ కంప్లైంట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విష్ణు ప్రియా కి సగం పాపిలా రెడ్డి రావడానికి కారణం సోనియానే అని చెప్పుకోవచ్చు. మొదటివారం మొత్తం సైలెంట్ గానే ఉన్నాను విష్ణు ప్రియ ని రెచ్చగొట్టి మరి.. సోనియా ఆమె గేమ్ ను బయటకు తీసుకువచ్చింది. ఇందులో సోనియా స్ట్రాటజీ ఏంటో తెలియదు కానీ.. విష్ణు ప్రియ మాత్రం బాగా హైలైట్ అవుతోంది. 


ముఖ్యంగా సోనియా బిగ్ బాస్ ఇంటిలో ఉన్నది కూడా మర్చిపోయి.. విష్ణు ప్రియ వ్యక్తిగత విషయాల మీద కూడా కామెంట్లు చేయడం.. కుటుంబాన్ని లాక్కు రావడం విష్ణు ప్రియా ఫ్యాన్స్ ను బాగా హార్ట్ చేసింది. సోనియా మాత్రమే కాక యశ్మి, పృధ్విల గేమ్ కూడా అలాగే ఉంది.  పాయింట్ ఉన్నా లేకపోయినా.. వేరే కంటెస్టెంట్ లో మీద నోరు వేసుకుని పడిపోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. స్క్రీన్ టైమ్ కోసం ఇప్పుడు ఏదో ఒక చెత్త స్ట్రాటజీలతో ముందుకు వస్తూనే ఉన్నారు. 


ఏదో గొడవలు పడితేనే బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్నట్టు.. కారణమేమీ లేకుండానే కావాలని మరీ గొడవలు పెట్టుకుని ఇల్లంతా రాచ చేస్తున్నారు. టాస్కులు తక్కువ గొడవలు ఎక్కువ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన టాస్క్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ నిన్న వాక్సింగ్ ఛాలెంజ్ పెట్టారు. యశ్మీ టీం ఈ టాస్క్ విషయంలో త్వరగా ఇచ్చేసింది. పృథ్వి కూడా వ్యాక్స్ చేసుకోను అని చెప్పేసాడు. మరోవైపు నిఖిల్, నబీల్ ఒకరితో ఒకరు పోటీపడి మరియు వ్యాక్స్ చేయించుకున్నారు.


హెయిర్ క్వాంటిటీని బట్టి సంచాలకు సోనియా నబీల్ ని విన్నర్ గా డిక్లేర్ చేసింది. తన టీం ని గెలిపించిందన్న సంతోషంతో విష్ణు ప్రియ థాంక్యూ అంటూ సోనియా కాళ్ళు మొక్కింది విష్ణు ప్రియ. నిన్న మొన్నటిదాకా విష్ణు ప్రియ ని పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేసి.. ఆమెని ఆమె కుటుంబం గురించి దుర్భాషలాడిన సోనియా కాళ్ళ మీద విష్ణు ప్రియ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం


Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.