Jathara Movie: జాతర ఓ పెద్ద హీరోతో చేయాల్సింది.. ఆరు నెలలు ప్రయత్నించినా..!
Jathara Release Date: ఈ నెల 8న థియేటర్లలో జాతర మూవీ సందడి మొదలుపెట్టనుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు సతీష్ బాబు ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఓ పెద్ద హీరోతో చేయాల్సిందని.. ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదన్నారు.
Jathara Release Date: సతీష్ బాబు దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటించిన చిత్రం జాతర. దీయా రాజ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. మూవీటెక్ ఎల్‌ఎల్‌సీతో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందిన ఈ మూవీ నవంబర్ 8న ఆడియన్స్ ముందుకురానుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొంట మీడియాతో ముచ్చటించారు. మనిషి రాక్షసుడిగా మారి అమ్మవారిని చెరపడితే.. మరో నరుడు హరుడిగా మారి ఆ రాక్షసుడిని ఎలా అంతమొందించాడనేది జాతర సినిమాలో చూపిస్తున్నామని చెప్పారు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని.. ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వెల్లడించారు. డాక్యుమెంటరీగా తీస్తే వివాదాలు వస్తాయని.. క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని మూవీ రూపొందించామన్నారు.
Also Read: School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..
ఈ సినిమాలో హీరో పాత్ర మూడు డైమెన్షన్స్‌లో ఉంటుందని సతీష్ బాబు తెలిపారు. ఇందులో ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంటుందన్నారు. నేచురాల్ సౌండ్ డిజైనింగ్ చేయించామని.. జంధ్యాల సినిమాల్లో విన్నట్లు ఉంటుందన్నారు. తాను 2016 లో జాతర స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని.. నిర్మాతను అనుకోకుండా ఓ ఫంక్షన్‌లో కలిస్తే పాయింట్ చెప్పానని తెలిపారు. ఆయన వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ మాట్లాడగా.. బాగుందని చెప్పారని అన్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఉన్న అమ్మవారిని చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలు కొలుస్తారని చెప్పారు. ఏడాదిన్నరపాటు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ.. రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ చేసుకున్నానని తెలిపారు. గంగమ్మతల్లి అమ్మవారికి గురించి తీసిన మూవీనే జాతర అని అన్నారు. ఓ పెద్ద హీరోతో ఈ సినిమా చేయాల్సిందని.. అయితే ఆయనను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదన్నారు. ఆరు నెలలు ట్రై చేశామని.. అయినా కుదరలేదన్నారు. దీంతో తానే హీరోగా నటించానని.. ప్యాడింగ్ ఆర్టిస్టులను పెడదామని ప్రపోజల్ వచ్చినా తానే వద్దని చెప్పానని అన్నారు. తెలుగు తెలిసిన హీరోయిన్‌ను పెడదామని ప్రయత్నించినా.. బడ్జెట్‌కు కుదరలేదని.. ధీయా రాజ్ హీరోయిన్‌గా బాగా యాక్ట్ చేసిందన్నారు. సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారని తాను నమ్ముతానని.. త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.