Naga Chaitanya: నాగ చైతన్య, సమంత కలిసి నటించబోతున్నారా..చైతూ ఏమన్నాడంటే..!
Naga Chaitanya: మాజీ భార్య, సినీ నటి సమంతతో హీరో నాగ చైతన్య నటించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈక్రమంలో నటుడు నాగ చైతన్య స్పందించాడు.
Naga Chaitanya: టాలీవుడ్‌లో క్రేజీ కపుల్‌గా ఉన్న నాగ చైతన్య, సమంత గతేడాది వీడిపోయారు. అప్పటి నుంచి వీరి నుంచి ఏ వార్త వచ్చిన పాపులర్‌గా మారుతోంది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై నటుడు నాగ చైతన్య స్పందించాడు. బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డాలో చైతూ నటించాడు.
ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ కొనసాగుతోంది. ఈక్రమంలో మాజీ భార్య సమంత గురించి నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సామ్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా అన్న ప్రశ్నకు సున్నితంగా సమాధానం ఇచ్చాడు. మేమిద్దరం కలిసి నటిస్తామో లేదో తనకు తెలియదని..కేవలం విధికే తెలుసు అని అన్నాడు. ఒక వేళ తాము కలిసి నటించినా అది క్రేజీయే అవుతుందన్నాడు. మరోవైపు మరో హీరోయిన్‌తో ప్రేమాయణం వార్తలను ఖండించాడు.
టాలీవుడ్‌లో టాప్ హీరో, హీరోయిన్‌లుగా ఉన్న నాగ చైతన్య, సమంత 2017 వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి రెండు విధాలుగా జరిగింది. వివాహం అనంతరం వీరిద్దరూ మజిలీ సినిమాలో నటించారు. ఈమూవీలో భార్యాభర్తల పాత్రలు పోషించారు. 2021లో వీరు విడిపోయారు. అప్పటి నుంచి సమంత ముంబైకి మకాం మార్చింది. చైతూ మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఈక్రమంలో నాగచైతన్య, సమంత మళ్లీ కలిసి నటించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో చైతూ స్పందించాడు.
Also read:Monkeypox: దేశంలో మంకీపాక్స్ టెర్రర్..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..!
Also read:Hyderabad Police Towers: రేపే అందుబాటులోకి పోలీస్ టవర్స్.. కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook