Hero Nani Adopted a Stray dog Puppy: హీరో నాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్లు అలాగే ఇతర నటీనటులు కూడా పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు హీరోలు హీరోయిన్లు అయితే తమ పెంపుడు జంతువులకు కూడా సోషల్ మీడియా అకౌంట్లు తెరిచి మరీ వాటికి సంబంధించిన అప్డేట్స్ తమ అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వారంతా కూడా మంచి విలువ గల బ్రీడ్ డాగ్స్ ని కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు. అయితే నాని కుటుంబం మాత్రం ఒక వీధి కుక్కపిల్లను దత్తత తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. హీరో నాని తండ్రి రాంబాబు గంటా ఒక వీధి కుక్క పిల్లని దత్తత తీసుకోగా, దానికి చిట్టి అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఈ దత్తత తీసుకోవడానికి కారణం అల్లరి నరేష్ భార్య విరూప అని తెలుస్తోంది. ఆమె ద్వారానే నాని ఫ్యామిలీ కుక్కపిల్లని దత్తత తీసుకున్నారని అంటున్నారు.


ఈ మేరకు ఆ కుక్కపిల్లను దత్తత తీసుకునేందుకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన ఒక యానిమల్ యాక్టివిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక కుక్కపిల్లతో నాని తండ్రి రాంబాబు ఉన్న ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నాని అభిమానులైతే తమ హీరో సింప్లిసిటీ చూసి మెచ్చుకుంటున్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కుక్కపిల్లలు కొనడం కాదు ఇలా రోడ్ల పక్కన ఎలాంటి ఆదరణకు నోచుకోని కుక్క పిల్లలను తీసుకుని, దత్తత చేసుకుని పెంచితే బాగుంటుందని తమ హీరోని చూసి మిగతావారు కూడా నేర్చుకోవాలని వారు కామెంట్లు పెడుతున్నారు.


Also Read: Bandla Ganesh Targets Jr NTR: కేసీఆర్ టైగర్ అంటూ బండ్ల కామెంట్స్.. ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్


Also Read: Brahmastra Promotions in Cash Program: క్యాష్ ప్రోగ్రాంకి అలియా-రణబీర్.. బాలీవుడ్ రేంజ్ పడిపోయిందా.. తెలుగు ఆడియన్స్ రేంజ్ పెరిగిందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి