International Indian Film Festival Toronto: టాలీవుడ్‌లో నాని కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో 2019లో విడుదలైన సూపర్‌హిట్ మూవీ ‘జెర్సీ’ ( Jersey ) చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. కెనడాలో ఆగస్టు 9 నుంచి 15వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ టోరంటోలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. నిజ జీవితంలో ఓడిపోయిన ఓ క్రికెటర్‌ తన కొడుకు కలను నెరవేర్చడానికి లేటు వయసులో తిరిగి మైదానంలో అడుగుపెట్టి సాధించిన విజయాన్ని దర్శకుడు వెండితెరపై చూపించి అందరినీ కట్టిపడేశారు. వెండితెరపై క్రికెట్ అభిమానులతోపాటు.. సినీ ప్రేక్షకులను హీరో నాని (Nani), నటి శ్రద్ధా శ్రీనాథ్ అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కొడుకు, భార్య కోసం, కెరియర్ కోసం పడే తపన గురించి దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి  సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆగస్టు 11న రాత్రి 7.30గంటలకు ప్రదర్శించనున్నారు. Also read: Khaidi movie: టోరంటో ఫెస్టివల్‌లో ఖైదీ



ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ట్విట్టర్‌లో పంచుకుంది. ‘జెర్సీ’టొరంటో చిత్రోత్సవానికి ఎంపిక కావడం గౌరవంగా ఉందని పేర్కొంది. దీనిని హిరో నాని కూడా షేర్ చేశారు. ఇదిలాఉంటే..‘జెర్సీ’చిత్రాన్ని షాహిద్‌కపూర్‌ హిరోగా దర్శకుడు గౌతమ్ బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  Also read: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం