ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

తెలుగు సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య తుదిశ్వాస (Sekhar Kammulas father is no more) విడిచారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

Last Updated : Aug 2, 2020, 08:26 AM IST
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) ఇంట్లో విషాదం నెలకొంది. డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) తుది శ్వాస (Kammula Seshayya Passed Away) విడిచారు. వయసు రీత్యా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కమ్ముల శేషయ్య శనివారం ఉదయం (Sekhar Kammula's father is no more) కన్నుమూశారు. దర్శకుడి తండ్రి మరణం పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. శేఖర్ కమ్ముల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుశాంత్‌ను రియా చక్రవర్తి వేధించింది: అంకితా లోఖాండే

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో డీఐజీగా పని చేసిన ఆయన అనంతరం పదవీ విరమణ పొందారు. పదవి విరమణ తర్వాత సైతం కమ్ముల శేషయ్య మరో పనిని ప్రారంభించారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి సేవలందించారు. ఆయనకు సంతానం నలుగురు కాగా, చివరివాడు శేఖర్ కమ్ముల. శనివారం సాయంత్రమే కమ్ముల శేషయ్య అంత్య అంత్యక్రియలు హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో శనివారం సాయంత్రం జరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..

 

Trending News