Hero Nani Lucky Escape From a Accident: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి నేచురల్ స్టార్ అనిపించుకుంటున్న హీరో నాని ఒక ప్రమాదం నుంచి బయట పడినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే అంటే సుందరానికే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తృటిలో హిట్ మిస్ చేసుకున్న నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో దసరా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల గోదావరి ఖనిలో జరిగిందట. అయితే బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా ఆ బొగ్గు అంతా నానీపై పడినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అదృష్టవశాత్తు నానికి ఈ సమయంలో ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే హీరో మీద ఇలా బొగ్గు పడడంతో ఒక్కసారిగా సినిమా యూనిట్ అందరూ షాక్ అయ్యారని, వెంటనే షూటింగ్ ఆపేసి అందరూ నాని మీద బొగ్గు పడిన ప్రాంతానికి వెళ్లి అతని మీద నుంచి బొగ్గు తొలగించారని తెలుస్తోంది. దీంతో కాసేపు షూటింగ్ కి ఇబ్బంది ఏర్పడిందని అయితే నాని తనకేమీ కాలేదని వాళ్లకు ధైర్యం చెప్పి మళ్లీ షూటింగ్ కి సిద్ధమైనట్లు సమాచారం.


ఇక ఈ సినిమా కోసం నాని ఏడు కేజీల బరువు తగ్గి ఒకపక్కా తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇందుకోసం ఆయన తెలంగాణ మాండలికం కూడా నేర్చుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని విరాటపర్వం, రామారావు అండ్ బ్యూటీ సినిమాలు నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.


 ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సత్యం సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పక్కా లోకల్ నేపధ్యం ఉన్న సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడుతూ ఉండడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుందని నాని అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: Poorna:మొన్నే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా.. పెళ్లి విషయంలో పూర్ణ సంచలన నిర్ణయం?


Also Read: Mehaboob Dilse: మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం.. ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ గా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook