V movie releasing on OTT sep 5th: టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్‌ యాక్షన్ మూవీ ‘V’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వి ( V movie ) చిత్రంపై ఐదు నెలలుగా ఎన్నో ఊహగానాలు వినిపించాయి. తాజాగా వాటన్నింటికీ చెక్ పెట్టారు హీరో నాని. సెప్టెంబరు 5న ఈ చిత్రం ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు నాని ప్రకటించారు. ‘‘పన్నేండుళ్లుగా మీరు నన్ను చూడటానికి థియేటర్లకు వస్తున్నారు.. ఈ సారి మాత్రం నేనే మీ ఇంటికి వస్తున్నా అంటూ ఓ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఇప్పుడు ‘వి’ వేట.. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ‘టక్ జగదీష్’ ఆట ప్రామిస్ అంటూ దానిలో రాశారు. నాని ఇంకా ఎం రాశారో చూడాలంటే.. ఆయన ట్విట్టర్‌ను చూడాల్సిందే. Also read: V movie: వి మూవీ OTT రైట్స్ ఎంతో తెలుసా ?



ఇదిలాఉంటే... అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ వంటి భిన్నమైన చిత్రాల్లో నానిని సరికొత్తగా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి వి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. నాని, సుధీర్‌భాబు సరసన అదితీరావు హైద‌రీ, నివేదా థామ‌స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని నెగిటివ్ షేడ్ రోల్‌లో కనిపించానున్నారు. వీ మూవీ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలంటే.. సెప్టెంబరు 5వరకు వేచి చూడాల్సిందే. Also read: V Songs: సిరివెన్నెల కలం నుంచి ‘వస్తున్న వచ్చేస్తున్నా’ క్లాసిక్ సాంగ్