V Songs: సిరివెన్నెల కలం నుంచి ‘వస్తున్న వచ్చేస్తున్నా’ క్లాసిక్ సాంగ్

Vasthunnaa Vachestunna Lyrical Song: నేచురల్ స్టార్ నాని కీలకపాత్రలో నటిస్తున్న వి సినిమా నుంచి చూస్తున్న చూస్తూనే ఉన్నా.. సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది.

Last Updated : Mar 10, 2020, 12:43 PM IST
V Songs: సిరివెన్నెల కలం నుంచి ‘వస్తున్న వచ్చేస్తున్నా’ క్లాసిక్ సాంగ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబుల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్‌ మూవీ V. ఈ మూవీ నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. చూస్తున్న చూస్తూనే ఉన్న.. అనే సూపర్బ్ సాంగ్‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్స్ శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి గాత్రం అందించారు. సక్సెల్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చాడు.

Also Read: అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరితో సినిమా.. షూటింగ్ దాదాపు పూర్తి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అష్టాచమ్మా, సమ్మోహనం తర్వాత నాని, మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. మార్చి 25న వి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకున్న ఈ సినిమా ప్రమోషన్లలో యూనిట్ బిజిబిజీగా ఉంది. నాని నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News