Anantham Teaser Launch by Nikhil: వెంకట్ శివకుమార్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా అనంతం. రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. వెంకట్ శివకుమార్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరుద్ర ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాను విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. సాయిచరణ్ రెడ్డి సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు వెంకట శివకుమార్. లవ్ స్టోరీ కి సస్పెన్స్ ను కూడా జత చేసి మంచి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. 


ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ హీరో నిఖిల్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది అని, రుకచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అన్నారు నిఖిల్. చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.  


చిత్ర నిర్మాతలు విజయలక్ష్మి, సుధీర్ మాట్లాడుతూ.. "మా సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన హీరో నిఖిల్ గారికి మా కృతజ్ఞతలు. చాలా బిజీగా ఉన్నా కూడా మా కోసం టైమ్ ఇచ్చారు. ప్రేమ కథ తో పాటు మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో మా అనంతం సినిమాను నిర్మించాం. ఆద్యంతం కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే మంచి తేదీ చూసి థియేటర్లలో రిలీజ్ చేస్తాం" అని అన్నారు.


 


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


 


స్నిగ్ధ నయని సంగీతం అందించిన ఈ సినిమాకి రాహుల్ కేజీ విఘ్నేష్, దీపక్ కుమార్ సినిమాటోగ్రాఫర్లుగా పని చేశారు. పవన్ కల్యాణ్ కొదాటి ఈ సినిమాకి ఎడిటర్ గా వ్యవహరించారు.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter