హైదరాబాద్: హీరో రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదలకు చూసి ఓర్వలేక సినీ రంగంలోని కొందరు ప్రముఖులు తనను అణగదొక్కేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే ... 1990వ దశకంలో తాను నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్న వేళ.. తాను ఎదుగుతూ ఉంటే తాముండలేమని భావించిన కొందరు... తనను తొక్కేసేందుకు ప్రయత్నించారని హీరో రాజశేఖర్ ఆరోపించారు. ఎంతో మంది హీరోయిన్స్ ను నాతో యాక్ట్ చేయవద్దు అని అడ్వయిజ్ చేసిన వాళ్లు ఉన్నారు. ఎంతో మంది డైరెక్టర్స్ ను నాతో చేయవద్దు అని చెప్పిన వాళ్లు ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్లను ఎవరూ తొక్కేయలేరని పేర్కొన్నారు. 'గరుడవేగ' ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఇంటర్వూలో హీరో రాజశేఖర్ ఇలాంటి సంచనల వ్యాఖ్యలు చేశారు.