Hero Sai Dharam Tej's Republic Movie Zee5 event Sai Dharam Tej sent an audio message to fans: హీరో సాయి ధరమ్‌తేజ్.. సెప్టెంబర్ 10న హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్‌పై బైక్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. నెలరోజులు అపోలో హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందారు. ప్రస్తుతం దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నారు. తను చేయాల్సిన సినిమాల్ని 2022కు వాయిదా వేశారు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సాయి ధరమ్‌తేజ్.. తాజా చిత్రం రిపబ్లిక్ (Republic).. డిజిటల్ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్స్‌లలో భాగంగా తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ను తేజ్ విడుదల చేశారు. ఈ మెసేజ్‌కు ముందు రిపబ్లిక్ మూవీలోని ఒక సీన్‌ను యాడ్ చేశారు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ ఆడియో (Sai Dharam Tej Audio) మెసేజ్ వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమకు.. కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను (Republic Cinema) థియేటర్‌లో మీతో కలిసి చూడలేకపోయానని.. కానీ ఈ సినిమా జీ5లో విడుదల అవుతోందని చెప్పారు. మూవీని చూసి స్పందించాలని కోరారు సాయితేజ్. 


Also Read : Farm Laws Repeal Bill: సాగు చట్టాల రద్దుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం.. తొలిరోజే సభలో ప్రవేశపెట్టే అవకాశం


ఇక దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీ సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో ఉండగానే రిలీజైంది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కొత్త చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ శిష్యుడు దండు కార్తిక్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.



Also Read : Chickens Killed Due To DJ Music: డీజే మ్యూజిక్ కు 63 కోళ్లు బలి.. పోలీసులను ఆశ్రయించిన కోళ్ల ఫామ్ యజమాని


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook