Farm Laws Repeal Bill: గురునానక్ జయంతిని రోజున వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్న రైతులను తిరిగి తమ ఇళ్లకు వెళ్లి, కుటుంబసభ్యులను కలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినేట్ బుధవారం భేటీ అయ్యింది. మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం చట్టాల రద్దు బిల్లు-2021 ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది. వ్యవసాయ చట్టాల రద్దు ఇక లాంఛనమే.
సాగు చట్టాల రద్దుతో పాటు కొన్ని మినహా మిగతా ప్రైవేటు క్రిప్టో కరెన్సీల రద్దు/నియంత్రణ, అధికారికంగా డిజిటల్ ద్రవ్యాన్ని జారీ చేయడానికి ఆర్బీఐని అనుమతించడం వంటి అంశాలతో పాటు మొత్తం 26 బిల్లుల్ని ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ‘విత్తనాలపై బిల్లు’ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు విద్యుత్తు సవరణ బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వీటికి సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం జరిగింది.
ఇదిలా ఉండగా.. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నిరసనలు ప్రారంభమై ఈ నవంబర్ 26 నాటికి దాదాపు ఏడాది కానుంది. ఇదే సమయంలో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 23తో ముగియనున్నాయి.
Also Read: కర్ణాటకలో భారీ వర్షాలు, వరద ముంపులో బెంగళూరు నగర దృశ్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook