Siddharth Apology to Saina : సైనా నెహ్వాల్‌కు హీరో సిద్దార్థ్ బహిరంగ క్షమాపణలు..
Siddharth Apology to Saina Nehwal: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు హీరో సిద్దార్థ్ క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్‌లో సైనాకు లేఖ రాసిన సిద్దార్థ్.. తన వివాదాస్పద ట్వీట్‌పై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
Siddharth Apology to Saina Nehwal: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నోరు పారేసుకున్న హీరో సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెప్పక తప్పలేదు. సైనాపై సిద్దార్థ్ వేసిన అసభ్యకరమైన జోక్ పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని పట్ల వ్యతిరేకతను సిద్దార్థ్ సైనాపై చూపించడం... అదీ అసభ్యకరమైన భాషను వాడటం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ట్విట్టర్ ద్వారా సైనాకు క్షమాపణలు చెప్పడంతో పాటు వివరణ ఇచ్చుకున్నాడు.
'కొద్దిరోజుల క్రితం మీ ట్వీట్‌పై స్పందిస్తూ నేను వేసిన రూడ్ జోక్‌కి క్షమాణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా విషయాల్లో మీతో ఏకీభవించకపోవచ్చు. మీ ట్వీట్‌ని చదివినప్పుడు నిరాశతో లేదా కోపంతో నేను ఉపయోగించిన పదాలు, నా స్వరాన్ని సమర్థించుకోలేను. నాకు తెలుసు నేను అంతకుమించి దయ కలిగి వున్నాను. ఒక జోక్‌కి మనం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అది మంచి జోక్ కాదనే అర్థం. అలాంటి జోక్‌ను వాడినందుకు క్షమాపణలు.' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో... చాలామంది వ్యక్తులు ఆపాదించినట్లుగా తన ట్వీట్‌లో హానికరమైన ఉద్దేశమేమీ లేదని సిద్దార్థ్ పేర్కొన్నారు. తాను కూడా స్త్రీ పక్షపాతినే అని.. తన ట్వీట్‌లో లింగపరమైన విషయమేమీ లేదని... మీరొక మహిళ కాబట్టి మీపై దాడి చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అన్నారు. ఇదంతా పక్కనపెట్టి.. మీరు నా లేఖ అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, 'మీరెప్పటికీ నా ఛాంపియనే...' అని చెప్పుకొచ్చారు. సిద్దార్థ్ క్షమాపణల ట్వీట్‌పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. సిద్దార్థ్ పరిణతితో వ్యవహరించారని... సైనాకు క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషమని అభిప్రాయపడుతున్నారు.
అసలేంటీ వివాదం :
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇదే అంశంపై సైనా నెహ్వాల్ (Saina Nehwal and Hero Siddharth Issue) ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇక దేశానికి భద్రత ఉంటుందని ఎలా భావించగలమంటూ ప్రశ్నించారు. సైనా ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందించిన సిద్దార్థ్.. 'సబ్టిల్ కాక్ వరల్డ్ ఛాంపియన్... థాంక్ గాడ్.. దేశాన్ని రక్షించేవారు ఉన్నారు...' అంటూ పేర్కొన్నారు. సిద్దార్థ్ వాడిన 'కాక్' అనే పదానికి వేరే అర్థం ఉండటంతో అతని ట్వీట్‌పై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది మహిళా లోకాన్ని అవమానించడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ సైతం సిద్దార్థ్‌కు నోటీసులు జారీ చేసింది.
Also Read: విషాదం... కెనాల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు.. ఇద్దరు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook