Hero Sree Vishnu Hospitalized Due to Dengue: టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్లో అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రీ విష్ణు అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో హీరోగా మారాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అప్పట్లో నారా రోహిత్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో శ్రీ విష్ణు వరుస సినిమా అవకాశాలు దక్కాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత చాలా కాలం పాటు డిజాస్టర్లు అందుకున్న ఆయన మళ్లీ నీది నాది ఒకే కథ అనే సినిమాతో హిట్టు కొట్టారు. ఆ తర్వాత బ్రోచేవారెవరురా సినిమాతో కూడా హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఈ మధ్యకాలంలో మళ్లీ వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఆయన డెంగ్యూ కారణంగా హాస్పిటల్ పాలయినట్లు సమాచారం. శ్రీ విష్ణు గత కొన్నాళ్లుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ జ్వరమే అని భావించి ఆయన హాస్పిటల్ కి వెళ్ళలేదని ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకుంటున్నారని అంటున్నారు.


అయితే ఈరోజు ఉదయం బాగా నీరసం అయిపోయిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో పలు టెస్టులు చేసిన తర్వాత ఆయనకు డెంగ్యూ ఫీవర్ సోకిందనే విషయాన్ని గుర్తించారు డాక్టర్లు.


ప్రస్తుతానికి ఆయన ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిందని ఆ ప్లేట్లెట్స్ సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఒక రకంగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది కానీ ప్రాణాపాయం అయితే లేదని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విష్ణు పీఆర్ టీం నుంచి ఏదైనా ప్రకటన వస్తే కానీ అసలు ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.


Also Read: National Film Awards: బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్.. బెస్ట్ తెలుగు ఫిలిం ఏదంటే?


Also Read: National Film Awards: జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదిగోండి!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook