Varun Sandesh Nindha Movie: తన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తి భిన్నమైన పాత్రను నింద మూవీలో పోషించానని హీరో వరుణ్ సందేశ్ తెలిపారు. ఆయన హీరోగా, రాజేష్ జగన్నాధం దర్వకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ విశేషాలను వరుణ్‌ సందేశ్ మీడియా పంచుకున్నారు. రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో తనకే బోరింగ్‌గా అనిపించి.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని యూఎస్‌కు వెళ్లానని చెప్పారు. ఆ సమయంలోనే రాజేష్ ఈ కథను చెప్పారని తెలిపారు. స్టోరీ విన్న వెంటనే ఎంతో నచ్చడంతో వెంటనే చేసేద్దామని అన్నానని చెప్పారు. ఈ సినిమాలో పాత్రకు తన నిజ జీవితంలోని తన పాత్రకు అస్సలు పోలిక ఉండదన్నారు. తాను బయట జాలీగా, చిల్‌గా ఉంటానని.. తాను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండనని అన్నారు. కానీ ఈ సినిమా తన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించానని చెప్పుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా


ఈ సినిమా కథను రాజేష్ చెప్పిన విధానం నచ్చిందని.. ఆయనే స్వయంగా నిర్మిస్తున్నాడని తెలిసి మరింత ఆనందం వేసిందన్నారు వరుణ్ సందేశ్. ఆయనకు చాలా గట్స్, ధైర్యం ఉండటం వల్లే డైరెక్టర్‌గా.. ప్రొడ్యూసర్‌గా సినిమాను చేశారని అన్నారు. నింద సినిమాలో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతోందని.. తరువాత ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరన్నారు. పూర్తి స్టోరీని ఆర్టిస్టులు ఎవరికీ చెప్పలేదని.. అందుకే వారికి ఓ క్యూరియాసిటీ పెరిగిందన్నారు. అసలు నేరస్థుడు ఎవరనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్ అని.. తమకు మంచి టెక్నీషియన్లు దొరికారని అన్నారు. 


'నాకు కానిస్టేబుల్ అనే మూవీ చిత్రీకరణలో కాలికి గాయమైంది. ఆ వెంటనే నింద మూవీ షెడ్యూల్‌లో పాల్గొనాల్సి ఉంది. అప్పటికే ఆర్టిస్టులంతా రెడీగా ఉన్నారు. నా ఒక్కడి కోసం షూటింగ్‌ను రద్దు చేయడం ఇష్టంలేక గాయంతోనే షూటింగ్ చేశా. డైరెక్టర్ రాజేష్ గారి కోసమే అంత రిస్క్ తీసుకున్నా. ఆయన గారి రూపంలో నాకు ఓ మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. నింద మూవీ తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్నా. నిందలోని పాత్రకు ఆ చిత్రంలో పాత్రకు అస్సలు పోలిక ఉండదు. ఆ సినిమా ప్రమోషన్స్ జూలైలో మొదలుపెడతాం. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమా కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమా చేస్తున్నా.. జూన్ 21న ఆడియన్స్ అందరూ తప్పకుడా నింద సినిమాను థియేటర్స్‌లో చూసి విజయవంతం చేయాలి.' అని వరుణ్ సందేశ్ కోరారు.
 
ఇక బిగ్ బాస్ షో గురించి చెప్పిన వరుణ్‌ సందేశ్.. ఆ షో వల్ల తనకు ఆర్థికంగా కలిసి వచ్చిందన్నారు. తాను ఎలా ఉంటానో.. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందన్నారు. బిగ్ బాస్‌కు వెళ్లకముందు తన గురించి అందరూ ఏవేవో అనుకునేవారని.. ఆ షోలో తనను చూసి అందరూ ప్రేమించారని గుర్తు చేసుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా తన ఆర్థిక కష్టాలు తొలిగిపోయాయని చెప్పారు. ఆ షోకు ముందు రెండేళ్లు తాను ఖాళీగా ఉన్నానని.. చేతిలో కూడా ఎలాంటి సినిమాలు లేవన్నారు. అప్పుడు ఇంట్లో డబ్బులు అడిగేవాడిని కాదన్నారు. 


Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter