Kaliyugam Pattanamlo Movie Release Date: కలియుగం పట్టణంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 29న ఆడియన్స్‌ ముందుకు రానుంది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో శ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించారు. ఈ సందర్భంగా హీరో విశ్వ కార్తీకేయ మంగళవారం మీడియాతో చిత్రవిశేషాలను పంచుకున్నారు. ప్రతి మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని.. వాటిని చూపించేలా సినిమా ఉంటుందన్నారు. నంద్యాలలో ఈ సినిమా కథ జరుగుతుందని.. అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని టైటిల్ పెట్టామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Baltimore Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని పేకమేడలా కూలిపోయిన వంతెన..


ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని.. ఈ కారెక్టర్ కోసం చాలా వర్క్ షాప్స్ చేశామన్నారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుందని.. థ్రిల్లర్, సస్పెన్స్ మాత్రమే కాకుండా మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందన్నారు. ప్రతీ రెండు మూడు సీన్లకు కొత్త జానర్ అనిపిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని.. తన కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. సినిమాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపించామని.. పిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. చెడుని చెడుతోనే ఈ చిత్రంలో చూపిస్తామని.. క్రైమ్స్‌లోనూ డిఫరెంట్ సీన్లు కనిపిస్తాయన్నారు. 


హీరోయిన్ ఆయుషి పటేల్ తెలుగు అమ్మాయి కావడం సినిమాకు కలిసి వచ్చిందని విశ్వ కార్తీకేయ తెలిపారు. తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఆ అమ్మాయి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందన్నారు. చిత్రా శుక్లా కీలక పాత్ర పోషించారని చెప్పారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి కథ చెప్పిన విధానం, స్క్రీన్‌ ప్లే చూసి ఆశ్చర్యపోయాయని అన్నారు. క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తాను కనిపెట్టలేకపోయానని.. డైరెక్టర్ ఎంతో క్లియర్ విజన్‌తో ఉన్నారన్నారు.


ఈ సినిమా కథ విన్నప్పుడు ఇది చిన్న బడ్జెట్‌తో తీస్తారని అనుకున్నామని.. కానీ ఇది చాలా భారీ బడ్జెట్ మూవీ అని తెలిపారు. తన మీద పెట్టాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా పెట్టారని చెప్పారు. నిర్మాతలు చాలా సపోర్టివ్‌గా నిలిచారని.. ఎక్కడా ఇబ్బంది లేకుండా షూటింగ్‌ను నిర్వహించారని అన్నారు. సెన్సార్ నుంచి మంచి ప్రశంసలు వచ్చాయన్నారు. ఇండోనేషియా ప్రాజెక్ట్‌ కూడా చేస్తున్నానని.. ఆ సినిమాలో కూడా ఆయుషి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుందని తెలిపారు. మంత్ర, తంత్రాలు, చేతబడుల నేపథ్యంలో ఆ సినిమా ఉండబోతోందని వెల్లడించారు.


Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter