Baltimore Key Bridge Collapse After Ship Hits: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం.. ఒక భారీ నౌక ఫ్రాన్సిస్ స్కాట్ కీ అనే బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది. అప్పటికే ఆ బ్రిడ్జిమీద వాహానాలు కూడా ప్రయాణిస్తున్నాయి. భారీ నౌక కుదుపుతో, బ్రిడ్జీ ఒక్కసారిగా పేకమెడలా కూలిపోయింది. ఈ విషయాన్ని మేరీలాండ్ ట్రాన్స్ పోర్టేషన్ అథారీటి ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ ఘటన జరిగినప్పుడు అనేక వాహానాలు బ్రిడ్జీ మీద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ నౌక కుదుపునకు లోనుకావడంతో బ్రిడ్జీ సెకనుల వ్యవధిలో కుప్పకూలీ పటాప్ స్కో నదిలోపడిపోయింది. ఈ క్రమంలో అక్కడ మంటలు కూడా చెలరేగాయి.
షాకింగ్ విజువల్స్
అమెరికా - బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓడ ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి. pic.twitter.com/1OYjo3Fdqx
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024
మొత్తానికి ఈ షాకింగ్ ఘటనల్లో అక్కడ బ్రిడ్జీ మీదఆసమయంలో ఉన్న వారిలో దాదాపు 20 మంది నీటిలో పడి కొట్టుకుపోయారని తెలుస్తుంది. ఎవరీ జాడకూడా ఇప్పటివరకు లభ్యంకాలేదు. ఈ వంతెనను 1977 లో నిర్మించినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత భారీ నౌక, బ్రిడ్జీ మధ్యలో చిక్కుకునిపోయినట్లు తెలుస్తోంది.
పదుల సంఖ్యలో కార్లు, ఇతర వాహానాలు నదిలో పడిపోయినట్లు సమాచారం. అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక భారీ బ్రిడ్జీ పడపోవడంతో అక్కడ.. ఆ ప్రదేశం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిగా మారింది. వెంటనే స్థానికులు తమ వారి కోసం ఘటన ప్రదేశానికి చేరుకుని జాడ కోసం ఆరాతీస్తున్నారు.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
ఇప్పటికి కూడా కొందరు ఆచూకి లభించలేదని తెలుస్తోంది. గజఈతగాళ్లతో అక్కడి నదిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అంతేకాకుండా.. ఈత వచ్చిన వాళ్లు తప్ప, మిగతావారు బతకడం కష్టమే అన్నట్లు కూడా సమాచారం. ఊహించని ఘటనతో అగ్రరాజ్యం ఒక్కసారగి ఉలిక్కిపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook