Ketika Sharma Video: టైట్ ఫిట్ దుస్తుల్లో కేతిక శర్మ... ఢిల్లీ బ్యూటీ హాట్ జిమ్ వర్కౌట్స్...
Ketika Sharma Gym Wokrouts Video: హీరోయిన్ కేతిక శర్మ జిమ్ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేతిక వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...
Ketika Sharma Gym Wokrouts Video: చేసింది రెండు సినిమాలే అయినా ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా రొమాంటిక్‌తో వెండి తెరపై అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ ఆ తర్వాత లక్ష్య సినిమాలోనూ తన అందంతో ఆకట్టుకుంది. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా కేతిక శర్మ తన జిమ్ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్ట్ చేసి చెమటోడుస్తున్న కేతికను వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో కేతిక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేతిక బ్యూటీఫుల్, ఆసమ్, వావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేతిక ఇంతలా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంది కాబట్టే అంత ఫిట్‌గా ఉందంటున్నారు. మరికొందరు మాత్రం.. మరీ అంత పెద్ద బరువులు మోయడం అవసరమా అంటూ వెటకారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గిరీశాయ దర్శకత్వం వహిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook