పొలిటికల్ ఎంట్రీ కోసం క్యూకడుతున్న హీరోయిన్స్
దక్షిణ భారత దేశంలో సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ చేయడమనేది సర్వసాధారణం. అయితే ఎక్కువ శాతం నటులు మాత్రమే ఎంట్రీ ఇచ్చే వారు. ఎన్జీఆర్, ఎంజీఆర్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఓ వెలుగు వెలిగారు. వారి బాటలోనే చిరంజీవి, బాలకృష్ణ , పవన్ కల్యాణ్, కృష్ణంరాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్, రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారు. ఇలాంటి తరుణంలో పొలిటికల్ ఇచ్చేందుకు పలువురు హీరోయిన్లు క్యూకడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి సుహాషిని పొలికల్ ఎంట్రీపై స్పందిచారు.
పొలికల్ ఎంట్రీపై సుహాసిని స్పందిస్తూ ‘హీరోలే రాజకీయాల్లోకి రావాలా? హీరోయిన్స్ రాజకీయాల్లోకి రాకూడదా?' అంటూ ప్రముఖ నటి ప్రశ్నించారు. పోలిటికల్ ఎంట్రీ కోసం తామూ సిద్ధమేనన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘తమిళ ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం' అని సుహాసిని అన్నారు. సుహాసిని వ్యాఖ్యలను బట్టి రాజకీయాల్లో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఏండగా ఆమె సమకాలికులు కూడా రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రోజా, విజయశాంతి, జయసుధ , ఖుష్బు రాజీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మహిళల్లో ఒక్క జయలలిత మినహా మిగతా వారు రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు. రోజా, విజయశాంతి, జయసుధ రాజకీయాల్లో వచ్చినా కూడా ప్రభావం అంతత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ప్రముఖ నటి సుహాసిని పొలికల్ ఎంట్రిపై స్పందించడం... మిగిలిన వెటరన్ హీరోయిన్స్ రాజకీయాల్లో రావాలన్న ఆలోచనలో ఉన్నారు. జయ తరహా వీరు రాణించగలరా లేదా అనేది గమనార్హం.