Hi Nanna Movie Promotions: నేచురల్ స్టార్ నాని డిసెంబరు 07న 'హాయ్ నాన్న'(Hi Nanna Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సీతారాం ఫేమ్ మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తోంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇందులో భాగంగానే కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌ ఇంటికెళ్లాడు నాని. ఈ ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్‌ టైంలో హాయ్ నాన్న సినిమాలతోపాటు పలు విషయాలపై చర్చించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫాధర్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో బేబీ కియారా ఖన్నా.. నాని కూతురుగా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఎనలేని క్యూరియాసిటీని పెంచేశాయి. సమయమా సాంగ్ అయితే మిలియన్స్ వ్యూస్ రాబడుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్‌ అబ్దుల్‌ వహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు. 



హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్‌లలో(Hi Nanna Promotions) భాగంగా ట్విటర్ వేదిగా "ఆస్క్ నాని" (#AskNani) అనే సెషన్ నిర్వహించాడు నాని. ఇందులో ఫ్యాన్స్, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు నాని. ''కొత్త డైరెక్టర్లలో మీరు ఎవరితో పని చేయాలని కోరుకుంటున్నారు'' అని అడిగిన ప్రశ్నకు "బలగం డైరెక్టర్ వేణు" అని నాని సమాధానం ఇచ్చాడు.


Also Read: Nani: వెంకటేష్ కోసం రాసుకున్న కథలో నాని హీరో.. సినిమా ఎందుకు చేయలేదు చెప్పిన వెంకీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook