Manoj Vs Vishnu: మనోజ్, మౌనికల కేసు.. బౌన్సర్లతో విష్ణు ఎంట్రీ.. మీడియాపై మోహన్ బాబు చిందులు..
Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి. అంతేకాదు తండ్రీ కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. తాజాగా మంచు విష్ణు తాజాగా ఎంట్రీ ఇవ్వడంతో మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది.
Mohan Babu Vs Manchu Manoj: మావన సంబంధాలు అన్ని ఆర్ధిక సంబందాలే అని కారల్ మార్క్స్ ఏ సమయానా అన్నాడో అది అక్షరాలు నిజం అని మరోసారి ప్రూవ్ అయింది. రీసెంట్ గా ఏపీ మాజీ సీఎం జగన్ .. తనను మోసం చేసారంటూ చెల్లెలు షర్మిల రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ఉన్న మంచు కుటుంబం తమ పరువును తామే బజారుకు ఈడ్చుకున్నారు. దీంతో వారి పరువు ప్రతిష్ఠలు మంచులా కరిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి అభిమానులు.
మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారంలో ఇవాళ కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబాయ్‌లో ఉన్న పెద్ద కుమారుడు మంచు విష్ణు కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భారీ సెక్యురిటీ మధ్య తన ఇంటికి వెళ్లాడు. అటు జల్‌పల్లి ఫామ్‌హౌస్ వద్ద మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ చైర్మన్‌పై బ్రోకర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. తన బౌన్సర్లతో కెమెరాలు లాక్కొని బయటికి తోసేశారు మోహన్ బాబు అతని సిబ్బంది. ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చారు అంటూ చిందులు వేశారు. ప్రైవేట్ కంప్లైంట్ చేసి మీ పని పడతానన్నారు. తన పర్మిషన్ లేనిదే ఇక్కడికి రావొద్దంటూ మీడియా ప్రతినిధులను మోహన్‌బాబు చిందులు వేసారు. అంతేకాదు అతని సిబ్బంది కలిసి మీడియాపై అనుచితంగా ప్రవర్తించి బయటికి తరిమేశారు.
ఇక మోహన్‌బాబు పిర్యాదుపై మనోజ్, మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. 329, 351 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయన్నారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారన్నారు. తమ ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది అని... పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు తానే పరిష్కరించనన్నారు.
మరోవైపు మంచు మనోజ్ స్పందిస్తూ.. నేను డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం అందరినీ కలుస్తాను. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుంగా పోయింది. అందుకే పోరాటానికి నడుం బిగించాను.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.