HIT Director Sailesh Kolanu ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు జనాలను మెప్పిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిలర్ హారర్ జానర్లలో తెరకెక్కించిన చిత్రాలు సైతం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఓ సినిమా రాబోతోంది. 'హీట్' (ట్యాగ్ లైన్.. ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ 
సినిమాకు ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను హిట్ దర్శకుడు శైలేష్ కొలను విడుదల చేశాడు. 


శైలేష్ కొలను చేతుల మీదుగా విడుదల చేయించిన ఈ పోస్టర్‌లతోనే సినిమా థీమ్ ఏంటన్నది అర్థం అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తుంటే.. కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే.. ఇది ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఇక ఇందులో ఏదో మర్డర్ మిస్టరీని చూపించబోతోన్నట్టుగా తెలుస్తోంది. అయితే పోస్టర్‌తోనే ఈ రేంజ్‌లో ఆసక్తిని క్రియేట్ చేసి చిత్రయూనిట్ సక్సెస్ అయిందని చెప్పడంలో సందేహం లేదు. 


Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్


వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించాడు. ఇక రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేయగా.. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల  సహ నిర్మాతలుగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను మేకర్లు ప్రకటించబోతోన్నారు.


Also Read:  Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook