Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్

Manchu Manoj Aham Brahmasmi మంచు మనోజ్ కరోనా టైంలో అహం బ్రహ్మాస్మి సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవంలో రామ్ చరణ్‌ సందడి చేశాడు. కొన్ని రోజులకే ఆ సినిమాను పక్కన పెట్టేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 12:26 PM IST
  • నెట్టింట్లో కొత్త జంట సందడి
  • మౌనిక మీద మంచు మనోజ్ ప్రేమ
  • అహం బ్రహ్మాస్మిపై నోరు విప్పిన హీరో
Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్

Manchu Manoj Aham Brahmasmi మంచు మనోజ్ సినిమాలకు దూరమై చాలా కాలమే అవుతోంది. పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నాను అని ఆ మధ్యే మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. కరోనా కంటే ముందే తన సినిమాను మనోజ్ గ్రాండ్‌గా మొదలుపెట్టేశాడు. ఈ సినిమాను రామ్ చరణ్‌ వచ్చి ప్రారంభించాడు. అయితే కొన్ని రోజులు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేశారు. రామజోగయ్య శాస్త్రితో పాటలు కూడా రాయించుకున్నారు. అయితే మధ్యలో తన పర్సనల్ విషయాలతో సినిమాను పక్కన పెట్టేశాడు.

అలా మొదలైంది అంటూ వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తోన్న షోలో కొత్త జంట సందడి చేసింది. మంచు మనోజ్, మౌనికలు తమ పర్సనల్ విషయాలను ఈ షోలో పంచుకున్నారు. పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల మీద మనసు విప్పి మాట్లాడారు. తమది పదిహేనేళ్ల స్నేహమని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మనోజ్ చెప్పుకొచ్చాడు.

పెళ్లికి ముందు కూడా మోహన్ బాబు.. తమ ఇంటికి వచ్చేవారని, నాకు గోరు ముద్దలు కలిపి పెట్టిన రోజులు కూడా ఉన్నాయని, ఇప్పుడు అయితే మంచు లక్ష్మీ, నిర్మలా దేవీ గారు అమ్మ లేని లోటును తీర్చుతున్నారని, తనను యాక్సెప్ట్ చేశారని, ఎంతో బాగా చూసుకుంటున్నారని మౌనిక ఎమోషనల్ అయింది. అహం బ్రహ్మాస్మి సినిమా కోసం తనను సంప్రదించాడని, కారెక్టర్ కొత్తగా ఉంటుందని చేయమని చెప్పావ్.. మళ్లీ కనిపించకుండా పోయావ్.. అసలు ఆ సినిమా ఉందా? అని వెన్నెల కిషోర్ అడిగాడు.

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

ఆ సినిమాను నా మిత్రుడు రామ్ చరణ్‌ వచ్చి ప్రారంభించాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో టాలెంటెడ్. ఆ సినిమాను మొదలుపెట్టాం. కానీ ఆ సమయంలోనే నేను సినిమాను ఎంచుకోవాలా? మౌనికను ఎంచుకోవాలా? అనే పరిస్థితి ఎదురైంది. అవ్వ కావాలా? బువ్వ కావాలా? అనే పరిస్థితిలాంటిది.. సినిమా అంటే నాకు చాలా ఇష్టమే కానీ.. సినిమాలు మళ్లీ తీయొచ్చని అనుకున్నాను.. శ్రీకాంత్‌కు సారీ చెప్పా.. మళ్లీ చేద్దామని అన్నాను.. మౌనికను ఎంచుకున్నాను.. ఆ టైంలోనే తామిద్దరం చెన్నైలో ఏడాదిన్నర కలిసి ఉన్నాం.. ఇప్పుడు ఆ డైరెక్టర్ శ్రీకాంత్ మన వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే పెద్ద డైరెక్టర్ అవుతాడు.. అహం బ్రహ్మాస్మి సినిమా ఉంటుంది.. త్వరలోనే చేద్దామని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News