Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు

Sai Dharam Tej Bike Accident సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన బైక్ ప్రమాదం, ఆ సమయంలో మానవత్వం చూపించి కాపాడిన వ్యక్తి అప్పట్లో ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. తనకు ఆ వ్యక్తి ఎవరో తెలియదని, మానవత్వంతోనే కాపాడని, సెలెబ్రిటీ కాబట్టి కాపాడలేదని చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 01:28 PM IST
  • నెట్టింట్లో చర్చకు దారి తీసిన మెగా హీరో కామెంట్లు
  • సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తికి చుక్కలు
  • తేజు చెప్పిన మాటలు నిజం కాదా?
Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు

Sai Dharam Tej Bike Accident సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పటికే అరవై కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. అయితే సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ అదిరిపోయిందని మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంది. ఇక తేజు కూడా ఈ సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.

విరూపాక్ష బ్లాక్ బస్టర్ అవ్వడంతో తన అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. కౌంటర్లు వేయడంతో తేజుని మించినోడు లేడనిపించుకున్నాడు. హీరోయిన్‌తో దిగిన ఓ ఫోటోను నెటిజన్ షేర్ చేశాడు.. అన్నా మా జోడి ఎలా ఉందో చెప్పు అన్నా? అని అంటే.. అక్కా తమ్ముడిలా ఉన్నారంటూ కౌంటర్లు వేసి తన టైమింగ్‌ను బయటపెట్టేశాడు. అలా మొత్తానికి విరూపాక్షను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు.

విరూపాక్ష ప్రమోషన్స్ టైంలో సాయి ధరమ్ తేజ్ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బైక్ ప్రమాదం జరిగినప్పుడు ఓ వ్యక్తి సాయం చేశాడని, అతడికి డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోవడం లేదని, తన నంబర్ ఇచ్చానని, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పానంటూ సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం మీద సదరు వ్యక్తి స్పందించాడు.

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

తనకు ఎవ్వరూ ఫోన్ చేయలేదని, ఏ సాయం అందించలేదని, మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ తనను సంప్రదించలేదని, సాయి ధరమ్ తేజ్ కూడా ఫోన్ చేయలేదని అన్నాడు. పైగా అందరూ తనకు సాయం చేశారని అనుకుంటున్నారని, నీకేం డబ్బులు వచ్చాయని అంటున్నారట. అందరూ అలా అంటూ ఉండటంతో.. దీంతో జాబ్ కూడా మానేయాల్సి వచ్చిందట. నాలుగు నెలలుగా ఉద్యోగం లేకుండా ఖాళీగానే ఉన్నానంటూ తన బాధలు చెప్పుకున్నాడు.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News