సినీ ప్రపంచంలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ పేరు విననివారుండరు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు. ఏదైనా సినిమా లేదా ఎవరైనా సినీ ప్రపంచపు వ్యక్తి ఆయన్ని ఆకర్షించారంటే..ఇక ఆ గొప్పతనానికి అవధులుండవు. అదే జరిగింది. అందుకే జక్కన్న ఉబ్బితబ్బిబ్బౌతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్కార్ అవార్డు తరువాతా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో అవార్డు దక్కించుకుంది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట. ఇదే పాట ఇప్పుడు ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో ఉండటంతో ఇక ఖ్యాతి మరింతగా పెరిగింది. మొన్నటి వరకూ బాహుబలి..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తిగా రాజమౌళికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. 


ఇప్పటికే అందరితో ప్రశంసలు పొందుతున్న జక్కన్నకు జీవితంలో ఊహించని ఆనందం ఎదురైంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఇది జక్కన్నకు ఊహించని పరిణామం. అంతేకాదు..స్పీల్‌బర్గ్‌తో ఆన్‌లైన్ లైవ్ మాట్లాడటం జక్కన్నను ఆనందంలో ముంచేస్తోంది. స్పీల్‌బర్గ్-రాజమౌళి మాట్లాడుకున్నది రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. స్పీల్‌బర్గ్ కొత్త సినిమా ది ఫెబిల్ మ్యాన్ విడుదల సందర్భంగా రాజమౌళితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదే ఇప్పుడు జక్కన్న ఆనందానికి అవధుల్లేకుండా చేస్తోంది.


ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..


స్పీల్‌బర్గ్‌ను రాజమౌళి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు. ముందుగా హాయ్..ఎస్.ఎస్ ఎలా ఉన్నారంటూ స్పీల్‌బర్గ్ రాజమౌళిని పలకరించారు. చాలా బాగున్నా సర్..మిమ్మల్ని చూడటం, మీతో మాట్లాడటం ఓ గౌరవమని రాజమౌళి సమాధానమిచ్చారు. మీ ఆర్ఆర్ఆర్ సినిమా నన్నెంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపూ నా కళ్లను నేను నమ్మలేకపోయాను. అందులోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. విజువల్స్, టేకింగ్ అత్యద్భుతం. స్పీల్‌బర్గ్ నోట ఈ ప్రశంసలు రావడం రాజమౌళి ఆనందానికి అవధుల్లేకుండా చేసేసింది.


Also read: Pawan Kalyan Remuneration : పవన్ కళ్యాణ్‌కే అన్ని కోట్లా!.. ఇక నిర్మాతకు మిగిలేది ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook