Asvins Movie Ott Streaming: రీసెంట్ డేస్ లో సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిన చిత్రాల్లో 'అశ్విన్స్'(Asvins Movie ) ఒకటి.  సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌గా వ‌చ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. గత నెల 23న విడుదలైన ఈ సినిమా  పాజిటివ్ టాక్ తో ఇప్పటికీ కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై(SVCC) బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరపెడింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. జూన్ 20 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. హారర్‌ మూవీస్ ను ఇష్టపడే వారికి ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా నెలకూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. 


Also read: SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?


కథ విషయానికొస్తే.. యూట్యూబర్‌గా పనిచేసే అర్జున్‌ (వసంత్‌ రవి), అతని స్నేహితులు హాంటెడ్ (haunted houses) ప్రదేశాలు ఉన్న ఇల్లులు, కోటల్లో (Castle) వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో లండన్‌ శివారులోని ఐలాండ్‌లో ఉన్న ఇంటికి వ్లాగ్ చేయడానికి వెళ్తారు. అయితే అక్కడ ఆర్కియాలజిస్ట్‌ ఆర్తి రాజగోపాల్‌ (విమలారామన్‌) ఆత్మ తిరుగుతుందని.. కోటలో అడుగుపెట్టిన వారందరినీ చంపేస్తుందని తెలుసుకుంటారు. దీంతో అ ఆత్మ‌ను ఎలాగైన వారి కెమెరాలో బంధించాలని అనుకుంటారు. ఈ క్రమంలో అర్జున్ వారి మిత్రులకు ఎదురైనా అనుభావాలే ఈ స్టోరీ. ఈ చిత్రానికి తరుణ్ తేజ్ దర్శకత్వం వహించగా... విజయ్‌ సిద్ధార్థ్‌ సంగీతం అందించారు.


Also Read: Varun Tej-Lavanya: వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి