SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?

SS Rajamouli: రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం కల్కి2898AD. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ప్రచార చిత్రాన్ని చూసిన జక్కన్న మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2023, 09:00 AM IST
SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?

Rajamouli - Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898AD. ఇప్పటి వరకు ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్  నిన్న అమెరికాలో జరిగిన కామికాన్ కాన్ వేదికపై రివీల్ చేశారు. శుక్రవారం రిలీజైన ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని అడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్ కు ఫిదా అవుతున్నారు. భారీ బడ్జెడ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సిని ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా జక్కన్న రాజమౌళి కూడా ఈమూవీ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 

''గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. ప్యూచర్ గురించి సినిమాలు తీయడం చాలా కష్టమైన పని. మీరు దానిని సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింక్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్'' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.  

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కిలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫస్ట్ గ్లింప్స్‌‌తో పోస్టర్‌లో కూడా ఎక్కడ రిలీజ్ డేట్ ను ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై సందేహాలు మెదలుయ్యాయి. రాజమౌళి తాజాగా ట్వీట్ లో దీని గురించి మాట్లాడటంతో అనుమానాలకు మరింత బలచేకూర్చినట్లయింది. 

Also Read: Project K Glimpse: హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News