Raa Raja Title And First Look: ఆడియన్స్‌ను భయపెట్టేందుకు 'రా..రాజా' మూవీ రెడీ అవుతోంది. హారర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ పద్మిని సినిమాస్‌పై బీఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీలుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదల టైటిల్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే పోస్టర్‌, ఫస్ట్ లుక్‌లో ఎక్కడా కూడా నటీనటుల వివరాలను రివీల్ చేయలేదు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అవుతోంది. ఆకట్టుకునే కథనం, స్క్రీన్‌ప్లేతో స్క్రిప్ట్‌లో చాలా ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కాస్టింగ్ సమాచారాన్ని సస్పెన్స్‌లో ఉంచేందుకు మూవీ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను బీఎస్ ప్రసాద్ నిర్మించడంతోపాటు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అతి త్వరలోనే ఆడియన్స్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'రా..రాజా' మూవీని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. చిత్రంలో చాలా ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయని.. థియేట్రికల్ విడుదలకు ముందే ఆవిష్కరించబోతున్నాయని చెప్పారు. సినిమా అవుట్‌పుట్‌పై మొత్తం చిత్ర తారాగణం, సిబ్బంది నమ్మకంగా ఉన్నారు. నటీనటుల వివరాలు, ట్రైలర్, విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీఓపీగా రాహుల్ శ్రీవాత్సవ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు ఉప్పు మారుతి నిర్వర్తిస్తున్నారు. 


Also Read: Osmania University: ఉస్మానియా వర్సిటీకి కేంద్రం గుడ్‌న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల 


Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి