Konaseema Thugs Trailer : దుమ్ములేపుతోన్న కోనసీమ థగ్స్ ట్రైలర్
Konaseema Thugs Trailer ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. మన సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే థగ్స్ అనే చిత్రం రాబోతోంది. తెలుగులో కోనసీమ థగ్స్‌గా రాబోతోన్న ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.
Konaseema Thugs Trailer ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ ఇప్పుడు దర్శకురాలిగా బిజీగా మారిపోయారు. ఆమె దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్‌లో థగ్స్ అనే చిత్రం రతెరకెక్కుతోంది. తెలుగులో ఈ సినిమాను కోనసీమ థగ్స్ అంటూ రిలీజ్ చేయబోతోన్నారు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రాబోతోన్న కోనసీమ థగ్స్ సినిమాను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రలను పోషించారు. రీసెంట్‌గా విడుదల చేసిన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో ద్వారా సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేసేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను పలు భాషల్లో పలువురి సెలెబ్రిటీల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ మూవీ డిజిటల్ ట్రైలర్‌ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తి సురేష్ వంటి వారు విడుదల చేశారు.
143 సెకన్ల నిడివి ఉన్న కోనసీమ థగ్స్ ట్రైలర్‌లో వయోలెన్స్ ఎక్కువగా కనిపించినా ఎంతో ఇంటెన్సిటీ అన్ని పాత్రల్లో కనిపించింది. గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది. హ్రిదు హరూన్, సింహ ఇలా అందరి పాత్రలు ఉత్కంఠ రేపేలా రివీల్ చేశారు. ఎంతో ఇంటెన్సిటీతో యాక్టింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది.
ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుంచి బయట పడేందుకు పాత్రలు వేసే ఎత్తులు అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులతో ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచేలా సీన్లను డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ శామ్ సి ఎస్ సంగీతం, ఆర్ఆర్ ట్రైలర్ రేంజ్‌ను పెంచింది. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాలోని మూడ్‌ను క్యారీ చేయించాడు. అన్నిటి కంటే ప్రధానంగా కోరియోగ్రఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన బృందా టేకింగ్, మేకింగ్ అందరినీ ఆశ్చర్యచపరిచేలా ఉంది.
Also Read: Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook