Hrithik Roshan-Sussanne Khan: హవ్వ.. ఇదెక్కడి లవ్ స్టోరీ.. లవర్స్‌తో మాజీ భార్యాభర్తలు
Hrithik Roshan-Sussanne Khan: విడాకులు తీసుకున్న హృతిక్, సుసాన్ ఖాన్ జంట ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సుసాన్ ఖాన్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు హృతిక్.
Hrithik Roshan-Sussanne Khan: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్ ఖాన్‌తో విడాకుల తర్వాత నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అటు సుసాన్ ఖాన్ కూడా హృతిక్‌తో విడాకుల తర్వాత నటుడు అర్స్లన్ గోనీతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ రెండు జంటలు కలిసి గోవాలో పార్టీ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గోవాలో సుసాన్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడంతో... దాని ప్రారంభోత్సవానికి హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో హాజరయ్యాడు. అక్కడ హృతిక్-సబా, సుసాన్ ఖాన్-గోనీ జంటలు కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ ఫోటోలను సుసాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. విడిపోయిన హృతిక్-సుసాన్ జంట తమ కొత్త పార్ట్‌నర్స్‌తో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోవాలో పార్టీ జరిగిన మరుసటి రోజు ఉదయం ఈ రెండు జంటలు... ముంబై ఎయిర్‌పోర్టులో కెమెరాలకు చిక్కారు. హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో, సుసాన్ ఖాన్ తన బాయ్‌ఫ్రెండ్ గోనీతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో అటు హృతిక్, ఇటు సుసాన్ ఖాన్ మరొకరితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.
ఇక గోవాలో ఈ రెండు జంటలు దిగిన ఫోటో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలు కామెంట్ల చేస్తున్నారు. 'దీన్నే మిక్స్డ్ బిర్యానీ అంటారు..' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... 'ఒకే ఫ్రేమ్‌లో మాజీ భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో చూడ్డానికి ఏదోలా ఉంది..' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఎంత తప్పుడు ఉదాహరణగా మారుతున్నారో... ఒకే ఫ్రేమ్‌లో బాయ్‌ఫ్రెండ్, మాజీ భర్త ఎంత కంఫర్ట్‌గా పోజిచ్చారో...' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి తమిళ రీమేక్ విక్రమ్ వేదలో నటిస్తున్నాడు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొణేతో కలిసి ఫైటర్ చిత్రంలో నటించనున్నాడు.
What is TATA NEU: టాటా న్యూ యాప్‌తో ఎవరికి, ఎలాంటి ఉపయోగాలు.. పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook