Hrithik Roshan Liplock హృతిక్ రోషన్ సినీ కెరీర్ ఎలా ఉన్నా కూడా.. అతని పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో తిరుగుతున్నాడు. హృతిక్ రోషన్ వివాహాం, విడాకులు, అఫ్లైర్లు బీ టౌన్‌లో ఎప్పుడూ వివాదాలకు అడ్డానే ఉంటాయి. ఇక కంగనా హృతిక్ వ్యవహారం మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసేసింది. కంగనా వరుసగా హృతిక్ మీద కామెంట్లు చేస్తూనే వచ్చింది. వీరి వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. నోటీసులు ఇచ్చుకునే వరకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హృతిక్ రోషన్ మాత్రం ఇప్పుడు పూర్తిగా తన ప్రపంచంలో తాను ఉంటున్నాడు. సభాతో కలిసి చిల్ అవుతున్నాడు. హృతిక్ తన ఇంటి ఫంక్షన్లు, ఈవెంట్లకు ఆమెను వెంటేసుకుని వెళ్తున్నాడు. హృతిక్ పిల్లలతోనూ సభా క్లోజ్‌గానే ఉంటోంది. మొన్నటికి మొన్న హృతిక్ తన సోదరి బర్త్ డే ఈవెంట్‌కు సైతం సభాను తీసుకెళ్లాడు.


అలా ఈ ఇద్దరి వ్యవహారం ఒకప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీశాయి. హృతిక్ రోషన్ ఇప్పుడు మాత్రం సభా ఆజాద్‌తో కలిసి సందడి చేస్తున్నాడు. ఎయిర్ పోర్టులో వీడ్కోలు చెప్పేందుకు సభా వచ్చింది. వీడ్కోలు ఇచ్చే సమయంలోనే కారులో ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.


హృతిక్ రోషన్ ఇప్పుడు ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సిద్దార్థ్ఆనంద్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వార్ సినిమా తరువాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతోంది. పఠాన్ సినిమాతో సిద్దార్థ్ ఆనంద్ మంచి ఊపులో ఉన్నాడు. ఇక ఫైటర్ తరువాత ప్రభాస్ సినిమాను చేయబోతోన్నాడు సిద్దార్థ్ ఆనంద్.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook