Sekhar Movie: సినీ నటులు జీవితా రాజశేఖర్‌ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు చెల్లించలేదంటూ మరో ఫైనాన్షియర్ కోర్టుకు వెళ్లారు. దీంతో హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు ఆదేశించింది. దీంతో జీవితా రాజశేఖర్ దంపతులకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.  డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. పిటిషన్‌నువిచారణకు స్వీకరించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సాయంత్రంలోపు రూ.65 లక్షలు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నగదు డిపాజిట్ చేయకపోతే శేఖర్ సినిమా హక్కులన్నీ అటాచ్ చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లు, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ యూట్యూబ్‌లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని స్పష్టం చేసింది. రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించిన శేఖర్ మూవీ ఇటీవల విడుదల అయ్యింది. జీవితా రాజేశేఖర్‌ డైరెక్షన్‌ చేశారు. విడుదల అయిన దగ్గర నుంచి  పాజిటివ్ టాక్‌ సినిమా దూసుకెళ్తోంది. ఈక్రమంలో చిత్ర బృందానికి ఊహించని షాక్‌ తగిలింది.


కోర్టు ఆదేశాలపై హీరో రాజశేఖర్ స్పందించారు.  కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని చెప్పారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని..శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్‌ సినిమాకు మంచి స్పందన వస్తోందన్నారు. గతకొంతకాలంగా జీవితా రాజశేఖర్‌ దంపతులు వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. గరుడ వేగ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ అంశం కోర్టు దాకా పోయింది. చివరకు ఈ సమస్యను జీవితా రాజశేఖర్ దంపతులు పరిష్కరించుకున్నారు.


ఇటీవల శేఖర్‌ సినిమా కార్యక్రమంలోనూ జీవితా రాజశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కులాన్ని కించపర్చేలా మాట్లాడారు. దీనిపై పెను దుమారం రేగింది. చివరకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. తాజాగా శేఖర్‌ మూవీ సైతం వివాదాల్లో చిక్కుకుంది. త్వరలోనే సమస్యను నుంచి బయట పడుతామని జీవితా రాజేశేఖర్ దంపతులు చెబుతున్నారు.


 


Also read:Anasuya Bharadwaj Pics: అనసూయ పరువాల విందు.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న జబర్దస్త్ అందం!


Also read:Pawan Kalyan: సీఎం జగన్..పెట్రోల్, డీజిల్‌పై పన్ను ఎప్పుడు తగ్గిస్తారు..? పవన్ కళ్యాణ్ ఫైర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook