Hyper Aadi Fun With Anchor Varshini హైపర్ ఆది వర్షిణి ట్రాక్‌ గురించి లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. యూట్యూబ్ అయితే ఈ ఇద్దరికీ పెళ్లి చేసేసింది. వీరిద్దరి మీద రకరకాల థంబ్ నెయిల్స్ వస్తుండేవి. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారంటూ రకరకాలుగా రూమర్లు వస్తుండేవి. అయితే ఆది, వర్షిణిలు ఢీ షో నుంచి విడిపోయాక.. ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడ్డాయి. మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరూ చర్చల్లోకి వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢీ షో చేసిన సమయంలో ఆది, వర్షిణిల ట్రాక్ మాత్రం ఎక్కువగా వైరల్ అయింది. రష్మీ సుధీర్ ట్రాక్ తరువాత మళ్లీ అంతగా వార్తల్లోకి వచ్చింది వర్షిణి ఆది ట్రాకే. ఈ జోడికి అంతా ఫిదా అయ్యారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. మొదట్లో కాస్త దూరంగా ఉండేవారు. కానీ ఢీ షో ఎపిసోడ్‌లు ముందుకు వెళ్తున్న కొద్దీ క్లోజ్‌గా అయ్యారు. ఢీ షోలో మొదట్లో వర్షిణికి స్టెప్పులు వేయడం కూడా రాదు. కానీ చివరకు ఏదో అలా కొద్దిగా మూమెంట్స్ నేర్చుకుంది.


బుల్లితెరపై కొన్ని రోజులు అయితే ఆది, వర్షిణిల హవా నడించింది. ఈ ఇద్దరినీ ఆలీతో సరదాగా షోలో ఆలీ సైతం ఎన్నో పర్సనల్ ప్రశ్నలు కూడా అడిగాడు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకు మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆది, వర్షిణిలు మాత్రం బుల్లితెరపై రెచ్చిపోతూ ఉంటారు. తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోకు గెస్టులుగా వచ్చారు.


 



వర్షిణిని చూసి చాలా కాలమైందని, కాస్త లావు అయినట్టుగా ఉందని ఆది అంటాడు. ఎహె లేదు.. నేను ఏం లావు అవ్వలేదు.. అలానే ఉన్నాను అంటుంది వర్షిణి. అవునా అప్పుడు నిన్ను నేను ఎత్తుకున్నాను.. ఇప్పుడు మరి లేస్తావో లేదో అని.. తనను ఎత్తుకోవాలనే కోరికను తీర్చేసుకున్నాడు ఆది. ఆ విషయం తెలియని వర్షిణి.. ఎత్తుకో అని ఆది వద్దకు వచ్చింది. ఇక ఆ అవకాశాన్ని వదలుకోలేని ఆది.. వర్షిణిని ఆసాంతం ఎత్తుకుని తన కోరికను సంతృప్తి పర్చుకున్నాడు. ఇక వర్షిణి ఇంత తింగరిదా? అని కామెంట్లు పెడుతున్నారు.


Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ


Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook